Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో ఉస్తాద్ బ్యూటీ హొయలు..!

కావ్య కళ్యాణ్ రామ్ ఈ పేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ గంగోత్రి పాప అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 1:30 PM GMT
పొట్టి గౌనులో ఉస్తాద్ బ్యూటీ  హొయలు..!
X

కావ్య కళ్యాణ్ రామ్ ఈ పేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ గంగోత్రి పాప అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో వల్లంకి పిట్ట పాటలో కనిపిస్తున్న పాపే ఈ కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మందికి పరిచయమే. గంగోత్రి మూవీతో కెరీర్ మొదలుపెట్టి, తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.

మసూద మూవీతో మొదటిసారి హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టింది. ఈ మూవీ క్లిక్ అవ్వడంతో అందరి కళ్లు కావ్య కళ్యాణ్ రామ్ పై పడ్డాయి. ఆ తర్వాత వెంటనే బలగం మూవీలో నటించింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే ఉస్తాద్ లో ఛాన్స్ వచ్చింది. అయితే, ఆ మూవీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాల్లోనూ కావ్యకు గ్లామర్ చూపించే అవకాశం దొరకలేదు. ఎక్కువగా డీ గ్లామర్ గా, మేకప్ లేకుండా సహజంగానే నటించింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ ఫ్రాక్ లో మెరిసిపోయింది. పొట్టి పింక్ కలర్ ఫ్రాక్ లో తన థైస్ తో పాటు, ఎద అందాలు కూడా కనిపించేలా ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


క్యూట్ అని కొందరు, హాట్ అని మరికొందరు కామెంట్స్ చేస్తూ, ఈ పొట్టి పిల్ల అందాలను పొగిడేస్తున్నారు. బలగం మూవీ తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ ఫేట్ మారిపోయిందనే చెప్పాలి. ఆమె కు గుర్తింపు వెంటనే వచ్చేసింది. ఎక్కడికి వెళ్లినా పొట్టి పిల్ల అంటూ గుర్తు పట్టేస్తున్నారు. ఇక, మూవీల్లో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.

స్టార్ హీరోల సినిమాలు కాదు కానీ, యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా రాణించాలంటే మాత్రం, సాలిడ్ హిట్లు కనీసం రెండు, మూడైనా పడాలి లేకపోతే కష్టమే. బలగం హిట్ అయినా, ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోకి వెళ్లింది. కాబట్టి, ఆమె యాక్టింగ్ స్కోప్ తో పాటు గ్లామర్ స్కోప్ కూడా చూపించేలా వరస హిట్లు పడకుంటే కెరీర్ కష్టమే. అలా కాకుండా, హిట్ పడితే మాత్రం టాలీవుడ్ లో పాతుకుపోవడం మాత్రం ఖాయం. మరి, తర్వాతర్వాత కావ్యకు ఫ్యూచర్ లో ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.