పిక్ టాక్: కేతిక బ్లాస్టింగ్ గ్లామర్.. జానవులే..
చూడగానే ఆకర్షించే అందం కేతిక సొంతం. ప్రపంచంలోని అందమంతా రాశులు పోసినట్లుగా ఉంటుంది. యాక్టింగ్ విషయానికి వస్తే, అది కూడా ఇరగదీస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 24 July 2023 5:19 AM GMTచూడగానే ఆకర్షించే అందం కేతిక సొంతం. ప్రపంచంలోని అందమంతా రాశులు పోసినట్లుగా ఉంటుంది. యాక్టింగ్ విషయానికి వస్తే, అది కూడా ఇరగదీస్తూ ఉంటుంది.పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకర్షించింది. నటన పరంగానూ మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఆ మూవీ ప్లాప్ కావడం కేతిక కెరీర్ కి పెద్ద దెబ్బ పడింది.
ఆ సినిమా ప్లాప్ కావడంతో కేతిక కెరీర్ కి బాగానే మైనస్ అయ్యింది. మూవీ క్లిక్ అయ్యి ఉంటే ఛాన్సులు క్యూ కట్టేవి. కానీ, ఛాన్సులు రాకపోవడంతో అమ్మడి అందాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఈ బ్యూటీ మెప్పించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.
అయితే, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా లెహంగాలో మెరిసింది. గ్రీన్ కలర్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ ఆమె అందం మరింత అదరహో అనేలా ఉంది. హాట్ క్లీవేజ్ షో చూస్తుంటే కుర్రాళ్లకు ఊపిరాడటం లేదు. అయితే, చెవులకు బుట్టలు, ముక్కుకు ముక్కెరతో ఓ వైపు ట్రెడిషనల్ గాను, మరోవైపు హాట్ గాను హొయలు పోతోంది. ఫోటోలు చూసినవారంతా ఇంత హాట్ గా ఉంది ఏంటి బ్రో అని చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, కేతిక శర్మ గతేడాది నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా పెద్దగా నడవలేదు. దీంతో ఇక కేతిక కెరీర్ ముగిసిపోయినట్లే అనుకున్న సమయంలో బ్రో సినిమాలో అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ఈ బ్రో సినిమా ‘వినోదయ సీతమ్’ రీమేక్ అనే విషయం తెలిసిందే . ఇప్పుడు కేతిక ఆశలన్నీ ఈ సినమాపైనే ఉన్నాయి. మరి ఈ మూవీ హిట్ అయితే, మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.
కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది.తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.