వెకేషన్లో లావణ్య స్టైలిష్ లుక్!
లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా అన్నిలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. రేర్ గా డిజైనర్ ..జిమ్ దుస్తుల్లో అభిమానుల్ని మురిపిస్తుంది.
By: Tupaki Desk | 6 Sep 2023 5:35 AM GMTలావణ్య త్రిపాఠి సోషల్ మీడియా అన్నిలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. రేర్ గా డిజైనర్ ..జిమ్ దుస్తుల్లో అభిమానుల్ని మురిపిస్తుంది. గ్లామర్ ఎలివేషన్లకు లావణ్య తొలి నుంచి దూరమే. స్కిన్ షో..క్లీవేజ్ షో లు వంటివి చేయదు. ఇప్పటికే అదే రూల్ పాటిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. వెండి తెరపైనా అంతే డీసెంట్ పాత్రలతో కనిపిస్తుంది. గ్లామర్ పాత్రలకు ఏమాత్రం దారివ్వదు. ఒకవేళ అలాంటి ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తుంది.
ఆ రకంగా టాలీవుడ్ లో అంత బిజీ నటి కాలేకపోయింది. చేసే పాత్ర ఏదైనా డీసెంట్ గా ఉండాలి తప్ప! వల్గర్ ఉంటే ఒప్పుకోదు. తాజాగా లావణ్య కొత్త ఒకటి ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. అందలో లావణ్య వంగపువ్వు రంగు డిజైన్ లో తళుక్కున మెరిసింది. వెకేషన్ లో భాగంగా దిగిన ఫోటో ఇది. సముద్రంలో చెక్క బ్రిడ్జిపై లావణ్య ఇలా కెమెరాకి రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జా లంలో వైరల్ గా మారింది. లావణ్య అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇటీవలే మెగా వారసుడు వరుణ్ తేజ్ తో లావణ్య ఎంగేజ్ మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏమాత్రం విమర్శలు రాకుండా అన్నీ రకాల జాగ్రత్తలతో ముందుకెళ్తుంది. కొత్త ప్రాజెక్ట్ లు కూడా కమిట్ అవ్వలేదు.
తమిళ్లో ఓ సినిమా మినహా తెలుగులో సినిమాలు చేయలేదు. డిసెంబర్ లో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. అటుపై లావణ్య సినిమాలు కొనసాగిస్తుందా? మెగా కోడలిగా ఇంటికే పరిమితమవుతుందా? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మెగా ఫ్యామిలీ వాటిని ఎంతవరకే యాక్పెప్ట్ చేస్తుంది అన్నది ఓ సస్పెన్స్.