Begin typing your search above and press return to search.

మల్లెతీగలా మనసు దోచేస్తుంది..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ మలైకా అరోరా ఏం చేసినా సరే అదో సెన్సేషన్ అవుతుంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:55 AM GMT
మల్లెతీగలా మనసు దోచేస్తుంది..!
X

బాలీవుడ్ స్టార్ యాక్టర్ మలైకా అరోరా ఏం చేసినా సరే అదో సెన్సేషన్ అవుతుంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించే అమ్మడు కేవలం హిందీ సినిమాలే కాదు తెలుగు సినిమాల్లో కూడా తన గ్లామర్ షోతో మెప్పించింది. అందుకే మలైకా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో సౌత్ ఆడియన్స్ కూడా ఎక్కువమంది ఉంటారు. ఇక అర్జున్ కపూర్ తో అమ్మడి ప్రేమాయణం గురించి కూడా అందరికీ తెలిసిందే.. తను ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని కోరుకునే మలైకా సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.

ఇక లేటెస్ట్ గా యోగా ఫోజులతో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చింది మలైకా. మల్లె తీగలా అలా నడుము బెండ్ చేసిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన మలైకా ఈరోజు మనం ఎలా ఉన్నా అనేది యోగా ద్వారా స్వీయ ఆవిష్కరణ చేసుకోవచ్చు.. యోగా తో ప్రయాణం శాంతిని అందిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో కొనసాగడానికి ప్రతిరోజు యోగాని ఒక రిమైండర్ గా పెట్టుకోండని కామెంట్ పెట్టింది. అయినా మలైకా షేర్ చేసిన ఫోటోని పదే పదే చూసే ఆడియన్స్ ఆమె పెట్టిన కామెంట్ ని పట్టించుకుంటారా చెప్పండి.


మలైకా లేటెస్ట్ యోగా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలైకా చెప్పిన యోగా పాఠాలు ఎవరైనా పాటిస్తారా లేదా అన్నది చూడాలి. సోషల్ మీడియా పోస్ట్ లు, ఫోటో షూట్స్ తోనే కాలం వెళ్లదీస్తున్న మలైకా తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేయాలని అనుకుంటుంది. సినిమాల లెక్క తగ్గినా ఇన్ స్టా ద్వారా అమ్మడికి బాగానే డబ్బులు వస్తున్నాయని తెలుస్తుంది. అందుకే క్రమం తప్పకుండా ఇన్ స్టాగ్రాం లో ఫోటోలు షేర్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వట్లేదు మలైకా.

తెలుగులో కెవ్వు కేక లాంటి స్పెషల్ ఐటం సాంగ్స్ చేసిన మలైకా మళ్లీ ఇక్కడ అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అయితే కొత్తగా ఈమధ్య వచ్చిన హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ కి సై అనేయడంతో మలైకా లాంటి వాళ్లకి పెద్దగా ఛాన్స్ లు లేకుండా పోతుంది. అయితే మలైకా ని తీసుకుంటే మాత్రం ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. అవకాశాలు వచ్చినా రాకపోయినా మలైకా మాత్రం తన సోషల్ మీడియా పోస్ట్ లతో ఆడియన్స్ ని అలరిస్తుంది.