ఫొటో టాక్: సైమా వేడుకలో మృణాల్ మతిపోగొట్టేసింది!
ప్రతి సంవత్సరం సైమా అవార్డ్స్ వేడుక అట్టహాసంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2023 4:14 AM GMTప్రతి సంవత్సరం సైమా అవార్డ్స్ వేడుక అట్టహాసంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా సైమా( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 దుబాయిలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. ఈ రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులకు అవార్డులు అందజేశారు.
కాగా, ఈ అవార్డు వేడుకకు చాలా మంది ముద్దుగుమ్మలు హాజరయ్యారు. అయితే, వారందరిలో హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా సీతారామనం నిలిచింది. అలాగే, ఉత్తమ పరిచయ నటిగా కూడా మృణాల్ అవార్డు గెలుచుకుంది.
ఈ క్రమంలో, ఆ అవార్డులు అందుకునేందుకు మృణాల్ అక్కడకు వచ్చారు. ఆ సమయంలో ఆమె ధరించిన డ్రెస్ స్పెషల్ గా నిలిచిందని చెప్పొచ్చు. జిగేల్ జిగేల్ మనే చంకీల డ్రెస్ ధరించింది. పింక్ కలర్ డ్రెస్ లో కరెక్ట్ గా ఎద అందాలు కనిపించేలా, అక్కడకు వరకు కట్ ఇచ్చింది. దీంతో, అక్కడి నుంచి అందాలు ఎగసిమరీ కనపడుతున్నాయి. ఇక సింపుల్ ఇయర్ రింగ్స్, ఆ డ్రెస్ కి సెట్ అయ్యేలా మేకప్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.
ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా, ఈ సైమా అవార్డ్స్ లో ఈ సంవత్సరం ఉత్తమ నటుడి అవార్డు ఆర్ఆర్ఆర్ మూవీకి గాను ఎన్టీఆర్ కి దక్కింది. ఇదే ఆర్ఆర్ఆర్ మూవీకి ఉత్తమ దర్శకుడి అవార్డు రాజమౌళికి రావడం విశేషం.
ఇక, మృణాల్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె తెలుగులో వరస అవకాశాలు అందుకుంటోంది. సీతారామంతో ఆమె అందరి ఫేవరేట్ అయిపోయింది. నానితో కలిసి హాయ్ నాన్నలో నటించింది. ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని ఆఫర్లు కూడా ఆమెకు వస్తున్నట్లు సమాచారం.