లండన్ వెకెషన్ లో నదియా సూపర్ క్లిక్!
వెటరన్ నటి నదియా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ తనదైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
By: Tupaki Desk | 8 Oct 2023 12:30 PM GMTవెటరన్ నటి నదియా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ తనదైన మార్క్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఎక్కువగా మామ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తు న్నారు. ప్లాష్ బ్యాక్ రోల్స్ లోనూ తనదైన మార్క్ వేస్తున్నారు. తెలుగు..తమిళ్ లో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగు తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతమంది నటీమణులొచ్చానా...నదియా కి మాత్రం పోటీ కానే కాదు.
నేచురల్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకోవడంమే నదియాకి కలిసొచ్చిన అంశం. అందుకే 56 ఏళ్ల వయసులోనూ బిజీగా ఉన్నారు. గతేడాది వండర్ ఉమెన్ తో ఇంగ్లీష్ లోనూ ఓ సినిమా చేసారు. అది నదియా కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అందులో వైవిథ్యమైన పాత్రతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నదియా లైనప్ లోకొన్ని సినిమాలున్నాయి. ఇంత బిజీగా ఉన్న నటి ఆటవిడుపు కోసం లండన్ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.
నదియా లండన్ వెకేషన్ మోడ్ లో ఉన్న కొన్ని ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసారు. అందులో నదియా జీన్స్ ప్యాంట్ దరించి..షర్ట్ పై బ్లాక్ వింటర్ కోట్ ధరించారు. వైట్ కలర్ స్పోర్స్ట్ ధరించారు. కళ్లకి గ్లాసెస్ ధరించి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబయ్యారు. అందమైన గ్రీనరి మధ్యలో నదియా మరింత ఆకర్షణయంగా కనిపిస్తున్నారు. ఎండిపడిపోయిన చెట్టు మోడుపై కూర్చుని నవ్వుతూ కెమెరాకి ఫోజులిచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లైకులు..కామెంట్లతో తో అభిమానులు అభిమానం చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో నదియా పెద్ద యాక్టివ్ గా ఉంటారు. చాలా రేర్ గానే నచ్చిన ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు. అలాగే వెకేషన్లకు వెళ్లడం కూడా చాలా రేర్. షూటింగ్ ల నుంచి ఉపశమనం కోసం ఈసారి ఇలా ప్లాన్ చేసారు.