Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మా బాలయ్య బంగారం

నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అని ఆయన అభిమానులు ఎన్నో సంఘటనలను ఉదాహరణ గా చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   6 July 2024 8:53 AM GMT
పిక్ టాక్ : మా బాలయ్య బంగారం
X

నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అని ఆయన అభిమానులు ఎన్నో సంఘటనలను ఉదాహరణ గా చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య తన నియోజకవర్గ పర్యటన లో ఉన్నాడు.

ఇటీవల హిందూపురం నియోజకవర్గం పర్యటనలో జనంతో కలిసి పోయి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక విందు భోజనం లో వృద్ధురాలితో కలిసి, ఆమె పై చేయి వేసి సరదాగా ముచ్చటించిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఇలా జనాల్లో కలవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

ఎమ్మెల్యే అవ్వగానే కొమ్ములు వచ్చినట్లు ప్రవర్తించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఏమాత్రం గర్వం లేకుండా, చిన్న పిల్లాడి మాదిరిగా తన పక్కన ఉన్న వారితో మాట్లాడుతూ, జోకులు వేస్తూ భోజనం చేయడం అనేది కేవలం బాలయ్య కే చెల్లింది.

ఇలాంటి సంఘటనల వల్లే మా బాలయ్య బంగారం అంటూ మేము చెప్పుకుంటాం అని నందమూరి ఫ్యాన్స్ ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. బాలయ్య అప్పుడప్పుడు ఫ్యాన్స్ ను కొడతాడు అంటూ ప్రచారం చేసే వారికి ఇలాంటివి కనిపించవా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఇంకా టైటిల్‌ పెట్టని బాబీ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. దసరాకు ఆ సినిమా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.