Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నిధి నిక్షేపాల‌కు కొద‌వేమీ లేదు

``నిధి నిక్షేపాల‌కు కొద‌వేమీ లేదు... వేటాడే వాళ్లే క‌రువు``.. నిజానికి క‌న్న‌డ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు ప్ర‌తిభ పూర్తిగా స‌ద్వినియోగం కాలేద‌నే భావించాలి.

By:  Tupaki Desk   |   24 Sep 2023 3:58 AM GMT
ఫోటో స్టోరి: నిధి నిక్షేపాల‌కు కొద‌వేమీ లేదు
X

``నిధి నిక్షేపాల‌కు కొద‌వేమీ లేదు... వేటాడే వాళ్లే క‌రువు``.. నిజానికి క‌న్న‌డ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు ప్ర‌తిభ పూర్తిగా స‌ద్వినియోగం కాలేద‌నే భావించాలి. ఈ భామ దుర‌దృష్టం ఏమిటో కానీ, న‌టించిన ప్ర‌తి సినిమా ఫెయిల్యూరే. ఒక్క ఇస్మార్ట్ శంక‌ర్ త‌ప్ప కెరీర్ లో చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ లోను న‌భా న‌టేష్ లాంటి హాట్ గాళ్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేస్కోవ‌డంతో అది కూడా త‌న‌కు ఏమంత క‌లిసి రాలేదు.

ఇప్పుడు నిధి ఆశ‌ల‌న్నీ `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` పైనే. ఈ సినిమా త‌న‌కు బిగ్ బ్రేక్ ఇస్తుంద‌ని నిధి చాలా ఆశ‌గా వేచి చూస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు ల‌క్కీ ఛామ్ గా మార‌తాడా లేడా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. వీర‌మ‌ల్లు చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుంటే నిధి ఇంకా డైల‌మాలోనే ఉండిపోయింది. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు.

త‌దుపరి నిధి రెగ్యుల‌ర్ సినిమాల‌తో పాటు, వెబ్ సిరీస్ ల‌లోను న‌టించేందుకు ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంద‌ని తెలిసింది. అయితే నిధి నెక్ట్స్ ఏంటి? అన్న‌దానిపై ఎలాంటి స‌మాచారం లేదు. ఇంత‌లోనే ఈ బ్యూటీ వెబ్ లో హాట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇన్ స్టాలో నిధి అగ‌ర్వాల్ షేర్ చేసిన ఓ హాట్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. అంద‌మైన క‌ళ్లు.. పింక్ లిప్స్.. బొద్దుత‌నం ఈ అమ్మ‌డికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. సింపుల్ గా అల్లిక‌ల డిజైన్ తో రూపొందించిన డిజైనర్ ఫ్రాక్ లో నిధి టూ హాట్ గా ఉంది. ఈ ఫోటోగ్రాఫ్ చూడ‌గానే నిధి అందాల‌కు ఫిదా అయిపోయామ‌ని యువ‌త‌రం హార్ట్ ఈమోజీల‌ను ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.