Begin typing your search above and press return to search.

వ్వా.. పూజా.. ఇంతలా కవ్విస్తే ఎలా?

ఇప్పటికీ ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఉన్నాయి

By:  Tupaki Desk   |   19 July 2023 5:21 AM GMT
వ్వా.. పూజా.. ఇంతలా కవ్విస్తే ఎలా?
X

ఇక టాలీవుడ్ లో పూజ కెరీర్ అయిపోయినట్లే అనుకునే సమయంలో ఆమెకు అలవైకుంఠ పురంతో హిట్ పడింది. అంతే, అక్కడి నుంచి పూజ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన ఆమే నటించింది.


ఇప్పటికీ ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఉన్నాయి. యువ హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, ఆమె స్థానం ఆమెకు పదిలంగా ఉండిపోయింది. కానీ, ఈ మధ్యే టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు తగ్గాయి.

దీంతో, ఆమె పూర్తిగా ముంబయిలోనే మకాం వేశారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ‘బవాల్’ పూవీ ప్రీమియర్స్ కి హాజరయ్యారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ఇది.

సాజిద్ నడియద్ వాలా నిర్మించిన ఈ సినిమాకి, నితేశ్ తివారి దర్శకత్వం వహించాడు. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మందుగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా పలువురు సెలబ్రెటీలు వచ్చి సందడి చేశారు. జాన్వీ కపూర్, తమన్నా లతో పాటు పూజా హెగ్డే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే, అందరిలో కెల్లా పూజా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం. పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది.

ఆ డ్రెస్ డీప్ నెక్ గా ఉండి, క్లీవేజ్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం. ఈ డ్రెస్ లో పూజా చాలా హాట్ గా కనపడుతోంది. తన డ్రెస్ కి కరెక్ట్ గా సూట్ అయ్యేలా హై హీల్స్ ధరించింది. హెయిర్ చాలా లూస్ గా వదిలేసింది. కాగా, దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజ అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.