Begin typing your search above and press return to search.

పూజా ఘాటైన లుక్.. స్టన్ అయ్యేలా..

హీరోయిన్లు సినిమాల్లో నటించడమే కాదు, పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 11:29 AM GMT
పూజా ఘాటైన లుక్.. స్టన్ అయ్యేలా..
X

హీరోయిన్లు సినిమాల్లో నటించడమే కాదు, పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆ ఫోటో షూట్ తర్వాత, లేదంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత అద్భుతంగా వచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అయితే, దానికి ముందు మాత్రం తాము ఇంత కష్టపడాల్సి ఉంటుంది. అని టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ముందు ఆమె రెడీ అవుతున్న ఫోటోలను పూజా హెగ్డే షేర్ చేశారు. మేకప్ వేసుకుంటున్నప్పుడు, రెడీ అవుతున్నాడు, చివర్లో హాట్ గా ఫోజు ఇచ్చిన ఫోటోని ఆమె పంచుకున్నారు. ఈ ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ, పూజ అందాలు మాత్రం చాలా స్పష్టంగా, అందంగా కనపడుతుండటం విశేషం.

ఈవెంట్ కి వెళ్లే ముందు తాను చేసిన రచ్చ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హౌ క్యూట్ అంటూ కొందరు, గార్జియస్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా, పూజ మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ఆమె వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు. దీంతో, బాలీవుడ్ కి చెక్కేసింది. మళ్లీ అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది.

అందుకే మళ్లీ అలవైకుంఠ పురంలో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆ మూవీ హిట్ కావడంతో, ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. వరసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమెకు ఇటీవల కాస్త ఆఫర్లు తగ్గాయి. అయితే, మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం మాత్రం ఉందని తెలుస్తోంది.