రాశి గ్లామర్ వైభవం.. ఇది మరో లెవల్ గురూ..
ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన జిల్ తో అభిమానుల మనసు దోచుకుంది.
By: Tupaki Desk | 3 Sep 2023 8:11 AM GMTఊహలు గుసగుసలాడే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన జిల్ తో అభిమానుల మనసు దోచుకుంది. రీసెంట్ గా థాంక్యూలో కనిపించి మెప్పించలేకపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పియరెన్స్ విషయానికొస్తే.. కెరీర్ ప్రారంభంలో క్యూట్ గా బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ రోజు రోజు నాజూకుగా ఫిట్ గా తయారవుతూ... అందాన్ని పెంచుకుంటోంది. తాజాగా అదిరిపోయే ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ దిల్లీ అందం.. తెలుగుతో దాదాపుగా స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయినా కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి అనే స్థాయికి కూడా వెళ్లిపోయింది. జిల్ తర్వాత సందీప్ కిషన్‌తో జోరు, రవితేజ బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, రామ్ పోతినేని శివమ్, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్.. ఇక చివరగా వచ్చిన నాగ చైతన్య థ్యాంక్యూ.. ఇలా వరుస సినిమాలు ఆమెకు నిరాశనే కలిగించాయి.
ఈ సినిమా అన్నింటీలోను ఆమె లిప్ లాక్స్ సీన్స్, బోల్డ్ సీన్స్ కూడా చేసింది. కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. అన్నీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఏదేమైనప్పటికీ తనవంతుగా ఈ ముద్దుగుమ్మ మాత్రం గ్లామర్ విషయంలో గానీ, నటన, డాన్స్ విషయంలో గానీ ఎక్కడ రాజీ పడకుండా చేయాల్సింది అంతా చేస్తోంది. సినిమాల ఫలితాలు మాత్రం ఆమెకు కలిసిరావడం లేదనే చెప్పాలి. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ.. హిందీలో రాజ్ అండ్ డీకేలో ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది సిరీస్ పర్వాలేదనిపించింది. కానీ రాశీకి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ తరచుగా బికినీ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ కవ్వించేందుకు ప్రయత్నిస్తుంటుంది. అవి సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతూ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. అలా తన ఫ్యాషన్ స్టైల్ ను మార్చేసిన ఈ బ్యూటీ.. అదిరిపోయే మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో కనిపిస్తోంది. వీలైనంత ఎక్కువగా అందాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తూ గ్లామర్ ట్రీట్ లో హద్దులు చెరిపేస్తోంది.
తాజాగా.. గ్లోబల్ స్పా మ్యాగ్జైన్ కు ఫొటోషూట్ చేసింది. ఇందులో అమె తన స్టన్నింగ్ లుక్స్ తో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. రెడ్ కలర్ డిజైన్ల్డ్ లెహంగాలో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే.. ఎద అందాలతో ఓపెన్ షో చేసింది. మంచి జ్యూవెలరీ కూడా ధరించింది. ఆమె చూపులు ఎంతో అందంగా కనిపించాయి. హెయిల్ స్టైల్ కూడా బాగుంది. సూట బుల్ నెయిల్ పాలిష్ కూడా వేసుకుంది. ఒక్కో ఫొటోలో ఒక్కోలా పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. మొత్తం ఆమె ఫ్యాషన్ మేకోవర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. యోధా, అరన్మనై 4, మేథావి చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని చిత్రాలు చర్చలు దశలో ఉన్నట్లు తెలిసింది.