ఎలా అయినా బతకగలను అంటున్న సమంత
కథానాయిక సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించి.. సంపూర్ణ ఆరోగ్యం కోసం లైఫ్‌ను ఎంతో ప్రశాంతంగా గడుపుతోంది.
By: Tupaki Desk | 5 Oct 2023 3:57 PM GMTకథానాయిక సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించి.. సంపూర్ణ ఆరోగ్యం కోసం లైఫ్‌ను ఎంతో ప్రశాంతంగా గడుపుతోంది. ముఖ్యంగా మనసు ప్రశాంతత కోసం తనకు ఇష్టమైన ప్రదేశాలను చూసేందుకు దేశాలను చుట్టేస్తోంది. అక్కడ దిగిన ఫొటోలను, తీసుకున్న వీడియోలను.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
తాజాగా ఓ అదిరిపోయే ఫొటోను షేర్ చేసింది. ఇందులో సామ్ యమా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది. జీన్స్ ప్యాంట్‌తో పాటు దానిపై బ్లాక్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. పైగా డ్రెస్‌కు సూట్ అయ్యేలా బ్లాక్ కలర్ కూలింగ్ గ్లాసెస్ ధరించింది.
అలాగే ఈ పిక్‌తో పాటు ఈ ఫొటోలోని యాష్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై 'ఎవ్రీబడీస్ డార్లింగ్' అని రాసి ఉండటం హైలైట్‌గా ఉంది. దాని కింద సమంత నిలబడి ఉంది. ఇంకా ఈ ఫొటోను సమంత షేర్ చేస్తూ.. Or not.. I can live with both అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే మొత్తంగా కలిపి చూస్తే.. సమంత ప్రతిఒక్కరి డార్లింగ్ అవ్వొచ్చు, కాకపోవచ్చు.. ఎలా అయినా నేను బతకగలను అని అర్థం వచ్చేలా రాసుకొచ్చింది.
ఇక ఈ ఫొటో చూసిన అభిమానులు.. సమంత లుక్‌ను అభివర్ణిస్తూ గార్జియస్, సూపర్, సమంత ప్రతిఒక్కరి డార్లింగ్, తగ్గేదే లే అంటూ కామెంట్లు పెడుతూ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కాగా, సమంత సినిమాల విషయానికొస్తే... ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ఖుషి చిత్రం రిలీజై పర్వాలేదనిపించే టాక్ తెచ్చుకుంది. రాజ్ అండ్ డీజే దర్శకత్వంలో ఆమె నటించిన సీటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్‌సిరీస్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక బ్రేక్ పూర్తైన తర్వాత.. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.