Begin typing your search above and press return to search.

బోడి గుండు 'జవాన్‌' సర్‌ ప్రైజ్‌ చేశాడు

బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుఖ్ ఖాన్‌ గత చిత్రం 'పఠాన్‌' సూపర్ డూపర్ హిట్ ను దక్కించుకోవడంతో పాటు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 2:00 PM GMT
బోడి గుండు జవాన్‌ సర్‌ ప్రైజ్‌ చేశాడు
X

బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుఖ్ ఖాన్‌ గత చిత్రం 'పఠాన్‌' సూపర్ డూపర్ హిట్ ను దక్కించుకోవడంతో పాటు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దాంతో షారుఖ్‌ తదుపరి సినిమా విషయంలో ఆసక్తి నెలకొంది. పైగా షారుఖ్‌ తదుపరి సినిమా తమిళ స్టార్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అవ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది అనడంలో సందేహం లేదు.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌' సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ కు సరిగ్గా నెల రోజులు ఉండటంతో తాజాగా యూనిట్‌ సభ్యులు సర్‌ ప్రైజింగ్‌ పోస్టర్‌ ను రిలీజ్ చేసి సినిమాపై మరింత అంచనాలు పెంచారు. తాజా పోస్టర్ లో షారుఖ్ లుక్ షాకింగ్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

షారుఖ్‌ ఖాన్‌ బోడి గుండుతో తుపాకీ చేత పట్టుకుని స్టైలిష్ గా కనిపించడంతో పాటు చాలా యంగ్‌ లుక్ లో కనిపిస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది. హీరోగా షారుఖ్ కి ఈ సినిమా మరో భారీ విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అన్నట్లుగా ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విభిన్నమైన లుక్ లో షారుఖ్‌ ను చూడబోతున్నందుకు ఆసక్తిగా ఉన్నామని ఫ్యాన్స్ అంటున్నారు.


బోడి గుండు లుక్ తో షారుఖ్ నిజంగా సర్‌ ప్రైజ్ చేశాడని ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పలువురు మాట్లాడుకుంటున్నారు. సినిమా కోసం షారుఖ్‌ ఎలా కనిపించడానికి అయినా సిద్ధం అని మరోసారి దీంతో నిరూపితం అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి.

తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు తమిళ్‌ స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. హిందీతో పాటు తమిళనాట కూడా ఈ సినిమా భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడాఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది.