Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వ‌ర్షాకాలంలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్ర‌ద్

శ్ర‌ద్ధా విదేశీ వెకేష‌న్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి

By:  Tupaki Desk   |   29 July 2023 5:02 AM GMT
ఫోటో స్టోరి: వ‌ర్షాకాలంలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్ర‌ద్
X

దాదాపు ద‌శాబ్ధంపైగానే సువిశాల‌మైన‌ సినీవినీలాకాశంలో న‌టిగా కొన‌సాగుతోంది శ్ర‌ద్దాదాస్. కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయి స్టార్ కాలేక‌పోయినా త‌న‌కంటూ అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేద‌ని నిరూపిస్తోంది. ప్ర‌స్తుతం 'పారిజాత ప‌ర్వం' అనే చిత్రంలో న‌టిస్తున్న శ్ర‌ద్ధా త‌న సినిమాల‌కు షోల‌కు నిరంత‌రం సోషల్ మీడియాల్లో కావాల్సినంత ప‌బ్లిసిటీ చేస్తోంది. నేటి ఓటీటీ ట్రెండ్ లో ఇత‌ర నాయిక‌ల్లానే శ్ర‌ద్ధా కూడా ఆస‌క్తిక‌ర పాత్ర‌ల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.


వీట‌న్నిటినీ మించి శ్ర‌ద్ధా విదేశీ వెకేష‌న్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. స్వ‌దేశంలో అయితే నిరంతరం ర్యాడిష‌న్ బ్లూ రిసార్ట్ అండ్ స్పాలో తన సమయాన్ని పూర్తిగా ఆస్వాధించ‌డం తెలిసిన‌దే. తాజాగా ఒక అన్ నోన్ డెస్టినేష‌న్ నుంచి హాటెస్ట్ ఫోటోషూట్ ని శ్ర‌ద్దా షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఒక అంద‌మైన కాటేజ్.. దాని ముందు అంద‌మైన స్విమ్మింగ్ పూల్.. అక్క‌డ పూల్ సైడ్ శ్ర‌ద్ధా ట్రీట్ మామూలుగా లేదు. లైట్ బ్రౌన్ క‌ల‌ర్ బికినీలో ఈ బ్యూటీ సెల్ఫీ దిగి పోస్ట్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతోంది. క్లిక్ లు లైక్ ల‌తో అభిమానులు హోరెత్తిస్తున్నారు. శ్ర‌ద్ధా ఈ లుక్ లో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది అంటూ ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.

2008లో సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన శ్రద్ధ ఆ తర్వాత దిల్ తో బచ్చా హై జీ, ది రాయల్ బెంగాల్ టైగర్, సనమ్ తేరీ కసమ్, బాబూమోషాయ్ బందూక్‌బాజ్, PSV గరుడ వేగ సహా పలు హిట్ చిత్రాలలో న‌టించింది. ఇటీవలే 'ఖాకీ: ది బీహార్ చాప్టర్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. నటి హిమాన్షు భట్నాగర్ వ్యంగ్య చిత్రం చాయ్ షాయ్ బిస్కెట్ -అర్ధమ్ - లేచింది మహిళా లోకం- పారిజాత ప‌ర్వం చిత్రాల్లో న‌టిస్తోంది.