డార్క్ థీమ్పై శ్రుతిహాసన్కి ఎందుకంత మోజు?
వ్యక్తిగత జీవితంలోని అన్ని ఎమోషన్స్ ని ఫేస్ చేసి చివరికి కరెక్షన్ మోడ్ లో ఉంది శ్రుతిహాసన్.
By: Tupaki Desk | 10 Sep 2023 2:59 PM GMTవ్యక్తిగత జీవితంలోని అన్ని ఎమోషన్స్ ని ఫేస్ చేసి చివరికి కరెక్షన్ మోడ్ లో ఉంది శ్రుతిహాసన్. తొలుత విదేశీ ప్రియుడు మైఖేల్ తో ప్రేమలో భంగపాటు, అనంతరం డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతో స్నేహం వగైరా వ్యవహారాలు తెలిసినవే. ప్రస్తుతం శంతను చెంతనే ఉంటే శ్రుతి అన్నిటినీ మరిచి ఎంతో హాయిని ఆస్వాధిస్తోంది.
ఇక తమ మధ్య అభిరుచులు కలిసాయి గనుకే ఈ స్నేహం ఇలా ఎప్పటికీ అనంతంగా కొనసాగుతుందంటూ శ్రుతి ఇంతకుముందే ధృవీకరించింది. ఇక శ్రుతిహాసన్ వ్యక్తిగత ఫ్యాషన్ ఎంపికల్లో డార్క్ థీమ్ కి ఎప్పుడూ శంతను కూడా సపోర్ట్ గానే ఉన్నాడు. ఎంపిక చేసుకునే దుస్తులు, మేకప్, నెయిల్ పాలిష్ ఇంకా ఏదైనా అది పూర్తిగా డార్క్ టోన్ తో ఆశ్చర్యపరిచేవే.
తన ఎంపికలు తన మనసును ఆవిష్కరిస్తున్నాయి. శ్రుతి ఇప్పుడు కూడా మరోసారి డార్క్ థీమ్ తో ఆశ్చర్యపరిచింది. డార్క్ బ్లాక్ ఇన్నర్.. దానిపై డార్క్ కలర్ మెస్సీ డిజైనర్ కోట్ శ్రుతి లుక్ ని హాట్ గా మార్చేశాయనడంలో సందేహం లేదు. ఇక చేతి వేళ్లకు నెయిల్ పాలిష్ మొదలు చేతికి గాజులు, చెవులకు లోలాకులు, వేలికి ఉంగరాలు ఇలా ప్రతిదీ బ్లాక్ థీమ్ తో ఎంతో డిఫరెంట్ గా కనిపించాయి. ప్రస్తుతం ఈ డిఫరెంట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శ్రుతి హాసన్ తదుపరి ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్ లో కనిపించనుంది. ప్రభాస్ సరసన శ్రుతి తొలిసారి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోందని కథనాలు వచ్చాయి.