Begin typing your search above and press return to search.

రిసార్స్ట్ లో సోనాల్ సో కూల్..సో హాట్!

ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహ‌న్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 10:37 AM GMT
రిసార్స్ట్ లో సోనాల్ సో కూల్..సో హాట్!
X

ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహ‌న్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వీలైంత‌న అందాల వ‌డ్డ‌న చేయ‌డం బ్యూటీ ప్ర‌త్యేక‌త‌. ఇటీవ‌లి కాలంలో ఆ వేగం మ‌రింత స్పీడ‌ప్ చేసింది. ఇండోనేషి యాలో సునామీ హెచ్చ‌రిక‌లా ఎప్ప‌టిక‌ప్పుడు బికినీ ట్రీట్ చేస్తోంది. రోజుకొక బికినీ స్టిల్ ఇన్ స్టాలో కి వ‌ద‌లుతూ మంట‌లు రేపుతోంది. ఇక చిట్టిపొట్టి నిక్క‌ర్లు ధ‌రించి సోనాల్ దాడి చేస్తే! ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

కుర్రాళ్లంతా ఒక్క క్ష‌ణం అలా స్ట‌న్ అవ్వాల్సిందే. తాజాగా సోనాల్ చౌహ‌న్ కొత్త ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇదిగో అమ్మ‌డిలా బీచ్ రిసార్స్ట్ లో సేద తీరుతుంది. వైట్ క‌ల‌ర్ బీచ్ కంప‌ర్ట్ దుస్తుల్లో అమ్మ‌డు ప‌డుకుని ఇలా విశ్రాంతి తీసుకుంటుంది. ఇందులోనూ అమ్మ‌డు సోకూల్..సోహాట్ లుక్ మాత్రం మిస్ అవ్వ‌లేదు. ఎంచ‌క్కా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో రెండు క‌ళ్లు మూసుకుని ..కాళ్లు చాపుకుని.. మ‌న‌సులోకి చెడు ఆలోచ‌న‌లు రాకుండా రిలాక్స్ అవుతుంది.

అమ్మ‌డు త‌ల‌కి రెడ్ క‌ల‌ర్ హ్యాట్ కూడా ధ‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. సోనాల్ అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఈ బ్యూటీ సినిమాల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో మంచి అవ‌కాశాలు వ‌చ్చినా టైమ్ క‌లిసి రావ‌డం లేదు.` లెజెండ్`...`పండ‌గ చేస్కో`..`ఎఫ్‌-3` మిన‌హా చిత్రాలేవి అమ్మ‌డికి స‌రైన విజ‌యాలు తెచ్చిపెట్ట‌లేదు. హిట్స్ తో సంబంధం లేకుండా అవ‌కాశాలు వ‌స్తున్నా! నిల‌దొక్కుకోలేక‌పోతుంది.

నాగార్జున హీరోగా న‌టించిన `ది ఘోస్ట్ ` లో గ‌తేడాది న‌టించింది. అదే స‌మ‌యంలో పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్` లో అవ‌కాశం అందుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కానీ ఆ రెండు సినిమా ఫ‌లితాలు కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి. ప్ర‌స్తుతానికి చేతిలో అవ‌కాశాలైతే లేవు. ఛాన్స్ ఎవ‌రు? ఇస్తారా? అని ఎదురు చూస్తోంది. సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది.