ఫోటో స్టోరి: వాణి వొంపుల వలకు చిక్కారో
By: Tupaki Desk | 23 Oct 2023 5:18 AM GMTఅందాల్ని బోల్డ్ గా ప్రదర్శించడం కొందరికే చెల్లిన విద్య. ఇందులో వాణీకపూర్ పై లెవల్లో ఉంది. ఈ భామ ఆహాకళ్యాణంలో ఎంత ట్రెడిషనల్ గా కనిపించిందో, మోడలింగ్ అసైన్ మెంట్స్ లో అంత హాట్ గా కనిపిస్తుంది. నిజానికి నటిగా కెరీర్ లో ఆశించినన్ని బ్లాక్ బస్టర్లను సాధించలేదు. కానీ తారా లోకంలో క్వీన్ గా వెలిగిపోతోంది. ఈ బ్యూటీ నిరంతరం ఫ్యాషన్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా అందాన్ని టెంప్టింగ్ గా ప్రదర్శించడం ఎలా అనే దానిలో వాణి ఎక్స్ పర్ట్.
ఇటీవలి వరుస ఫోటోషూట్లు దీనికి ఎగ్జాంపుల్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మ్యాగజైన్ కోసం వాణి డిజైనర్ బికినీ కాంబినేషన్ టాప్స్‌లో అద్భుతమైన లుక్‌లతో యువతరాన్ని కవ్వించింది. ఒక రకంగా వాణి ఒంపు సొంపుల వలల్ని విసిరిందని చెప్పాలి. ఈ కొత్త ఫోటోషూట్ లో మునుపెన్నడూ లేని విధంగా ఈ భామ తన అందచందాలను ప్రదర్శించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే వాణి గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ భామ యష్ రాజ్ బ్యానర్ లో పర్మినెంట్ ఆర్టిస్ట్. వాణి కపూర్ ఇంతకుముందు యష్ రాజ్ ఫిల్మ్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ వైఆర్ఎఫ్ చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. హృతిక్ తో వార్ తర్వాత కొన్ని ఫ్లాపుల్ని ఎదుర్కొంది. రణబీర్ కపూర్ తో షంషేరాలో నటించింది. కానీ ఆ తర్వాత వాణీ మరో పెద్ద చిత్రానికి సంతకం చేయలేదు. ఇటు దక్షిణాదినా తనకు పిలుపు లేదు. మొత్తానికి సినీ కెరీర్ తో పని లేకుండా మోడలింగ్ అసైన్ మెంట్లు, సోషల్ మీడియా పోస్టింగులతో సరిపుచ్చుతోంది.