Begin typing your search above and press return to search.
షాకింగ్.. ఒక్క ఏడాదిలోనే 1.64 లక్షల మంది ఆత్మహత్య..!
By: Tupaki Desk | 22 Dec 2022 2:30 AM GMTభారతీయులు మానసికంగా ధృఢంగా ఉంటారని అందుకే కరోనా నుంచి వారంతా త్వరగా కోలుకున్నారని విదేశాల్లో మనకు పేరుంది. అయితే గతేడాది క్రైమ్ రికార్డును పరిశీలిస్తే మాత్రం ఆ మాట తప్పేమో అనిపించక మానదు. ఎందుకంటే 2021లో ఏకంగా ఒక లక్షా 64 వేల 33 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తాజాగా వెల్లడైంది.
2021లో కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇదే సమయంలో వలస కూలీలు బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయి.భార్య భర్తలు ఇంటి పట్టునే ఉండటంతో గృహిణుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. ఉద్యోగాలకు వెళ్లే మహిళలు సైతం ఇంటికే పరిమితం కావడంతో అటు ఆఫీస్ పని .. ఇటు ఇంటి పని భారంగా మారి కొందరు డిప్రెషన్ కు లోనయ్యారు.
దీనికి తోడు ఆర్థిక మాంద్యంతో ఆర్థిక ఇబ్బందులను ప్రతీఒక్కరూ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. అయితే గతేడాది క్రైమ్ రికార్డు చూస్తుంటే మాత్రం ఒకింత బాధ కలుగకమానదు. 2021 క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను కేంద్ర హోంశాఖ తాజాగా లోక్ సభలో వెల్లడించింది.
వీటి ప్రకారంగా 2021లో ఒక లక్షా 64 వేల 33 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 42వేల 4మంది రోజువారీ వేతన జీవులు ఉండగా.. 23 వేల 179 మంది గృహిణులు ఉన్నారు. వీరిలో రోజు వారీ కూలీలతోపాటు.. వ్యాపారులు.. నిరుద్యోగులు.. వ్యవసాయ కూలీలు.. రైతులు.. కౌలు సాగుదారులు ఉన్నారు.
2021 క్రైమ్ రికార్డ్స్ ను పరిశీలిస్తే ప్రతీరోజు 63 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. మహిళల కోసం కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు.. చట్టాలు చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదని ఈ ఆత్మహత్యల లెక్కలను చూస్తుంటే అర్థమవుతోంది.
అధికారిక లెక్కల్లోనే 23 వేల 179 మంది మహిళలు ఉంటే అనధికారికంగా ఎంతమంది ఉంటారో అనేది ఆలోచనే భయాందోళనకు గురిచేస్తోంది. ఏది ఏమైనా గత ఏడాది మాత్రం కరోనా విలయతాండవానికి తోడు ఆర్థిక మాంద్యం పరిస్థితులు.. గృహ హింస కారణంగానే ఇంత భారీ స్థాయిలో భారతీయులు ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.