Begin typing your search above and press return to search.
విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఉందా.. అయితే బెస్ట్ 10 దేశాలు ఇవే!
By: Tupaki Desk | 19 July 2022 12:30 AM GMTబాగా చదువుకుని విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించడం ఇప్పుడు దాదాపు ప్రతి యువతీయువకుల కల. అంతేకాకుండా వీలుంటే సంబంధిత దేశంలోనే స్థిరపడిపోయి.. అక్కడే మంచి ఇల్లు కట్టుకుని జీవించాలని కూడా భారతీయ యువత కలలు కంటోంది. ఇప్పటికే అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. అంతేకాకుండా ఆ దేశాల్లో పౌరసత్వం కూడా సాధించి అక్కడే నివాసం ఉంటున్నారు.
ఇప్పుడు టెక్నాలజీ తెచ్చిన మార్పులతో ప్రపంచమే ఒక చిన్న విలేజీగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వచ్చిన విమానయానంతో ఒక్క రోజులోపే ఏ దేశానికైనా వెళ్లిపోగలుగుతున్నారు. ఆయా దేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించడంతోపాటు ఉన్నత కొలువులు ఒడిసిపడుతున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే.. అనేక దేశాల ప్రభుత్వాలు విదేశీయులను ఆకర్షించేందుకు నోమాడ్ వీసాల పేరిట కొత్త వీసాలను ఇస్తున్నాయి. తమ దేశంలో ఉంటే విదేశీ ఆదాయంపై పన్నులే చెల్లించక్కర్లేదంటూ అనేక తాయిలాలు కూడా ప్రకటిస్తున్నాయి.
ముఖ్యంగా జనాభా తక్కువగా ఉన్న దేశాలు, తమ దేశంలో వృద్ధుల జనాభా ఎక్కువ ఉన్నవి జనాభా పెంచుకోవడానికి త్వరగానే పౌరసత్వాలు కల్పిస్తున్నాయి. అలాగే ఆయా రంగాల వృత్తి నిపుణులకు కూడా పెద్దపీట వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వలసదారులకు అనువైన దేశాల జాబితా ఒకటి తాజాగా విడుదలైంది. ఎక్స్‌ప్యాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ పేరిట విడుదలైన ఈ జాబితాలో మొదటి పది స్థానాల్లో నిలిచిన దేశాలు ఇలా ఉన్నాయి.. ఈ జాబితాలో మెక్సికో, ఇండోనేషియా, తైవాన్, పోర్చుగల్, స్పెయిన్, యూఏఈ, వియత్నాం, థాయిల్యాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాలు టాప్ టెన్ లో నిలిచాయి.
మొత్తం 56 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా భారత్ 36వ స్థానంలో నిలిచింది. అమెరికా 14వ స్థానంలో, కెనడా 23వ స్థానంలో, చైనా 33వ స్థానంలో, ఇటలీ 44వ స్థానంలో, జపాన్ 47వ స్థానంలో, న్యూజిలాండ్ 51వస్థానంలో నిలిచాయి.