Begin typing your search above and press return to search.
10మంది భారత జవాన్లను విడిచిపెట్టిన చైనా?
By: Tupaki Desk | 19 Jun 2020 6:51 AM GMTగల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనాకు చిక్కిన 10 మంది భారత సైనికులను చైనా ఆర్మీ తాజాగా విడిచిపెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ 10మందిలో ఇద్దరు మేజర్లు కూడా ఉన్నట్టు సమాచారం.
సోమ, మంగళవారాల్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది చనిపోయారు. 76మంది గాయపడ్డారు. చైనా వైపు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. 35మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.
అయితే ఈ ఘర్షణల సందర్భంగా 10 మంది భారత సైనికులు చైనా బలగాలకు చిక్కారని.. ఇరుదేశాల మేజర్ జనరల్ స్థాయిలో మూడు రోజుల పాటు జరిగిన సుధీర్ఘ చర్చల అనంతరం చైనా సైన్యం గురువారం సాయంత్రం ఆ 10 మంది భారత జవాన్లను విడిచిపెట్టిందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే దీనిపై భారత్ ఆర్మీ మాత్రం అధికారికంగా స్పందించలేదు.
అయితే ఇప్పటికే గల్వాన్ లోయ ఘర్షణల్లో భారత సైనికులు ఎవరూ మిస్ కాలేదని ఇండియన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. మరి ఈ 10 మంది జవాన్ల వ్యవహారం పై భారత ఆర్మీ స్పందించాల్సి ఉంది.