Begin typing your search above and press return to search.
దంతెవాడలో పేలిన మావోల ల్యాండ్ మైన్
By: Tupaki Desk | 19 Oct 2018 7:49 AM GMTమావోలు మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి కూంబింగ్ కోసం వెళ్తున్న జవాన్ల వాహనాన్ని ల్యాండ్ మైన్ తో పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది వరకు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను హత్య చేసిన తరువాత ఏవోబీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ - ఒరిస్సా - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా జరుగుతుండగానే, మావోలు లేఖలు - ఆడియో టేపులతో హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసురుతూనే ఉన్నారు.
తాజాగా ఈ రోజు ఉదయం పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు భారీ ల్యాండ్ మైన్ పేల్చారు. ఐటీబీటీకి చెందిన 44వ బెటాలియన్ పోలీసులు వెళ్తున్న వాహనాన్ని పేల్చేయగా 10 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ జవాన్లను రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజుల క్రితం కూడా దంతేవాడలోనే ల్యాండ్ మైన్ పేల్చిన సంగతి తెలసిందే.