Begin typing your search above and press return to search.
కొనసాగుతున్న ప్రైవేటీకరణ యజ్ఞం..త్వరలో మరో 10 విమానాశ్రయాలు ప్రైవేట్‌పరం..!
By: Tupaki Desk | 6 Feb 2021 1:30 PM GMTదేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారు. దేశంలోని అనేక సంస్థలను ప్రైవేటీకరించారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ లాంటి సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పపోతున్నారు. అయితే విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. కొన్ని ప్రజాసంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయబోతున్నది. ఇప్పటికే పలు విమానాశ్రాయాలను ప్రైవేట్ పరం చేశారు. తాజాగా మరో 10 విమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరించబోతున్నారు.
మూడోదశలో దేశంలో 10 విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేయబోతున్నారు.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. లాభదాయకమైన విమానాశ్రయాలతోపాటు నష్టం వచ్చే విమానాశ్రయాలను విక్రయించడం లేదా ప్యాకేజీ కింద లీజుకు ఇవ్వడంపై పరిశీలిస్తున్నారు. ఆరు నుంచి 10 విమానాశ్రయాలను 50 ఏళ్లపాటు ప్రైవేట్‌కు ఇవ్వనున్నట్టు సమాచారం. ఏప్రిల్ నెలలో దీనిపై అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.