Begin typing your search above and press return to search.
చంద్రబాబు కేబినెట్లోకి కొత్తగా 10 మంది?
By: Tupaki Desk | 31 March 2017 6:58 AM GMTఏపీలో సీఎం చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఏప్రిల్ 2న ఉదయం 9.25కి పునర్ వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సాధా రణ పరిపాలన శాఖ అధికారులకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం. కేబినెట్లో పలు కీలక మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తం 10 మంది కొత్త మంత్రులు వచ్చే ఛాన్సులున్నాయి. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన నిమ్మ కాయల చినరాజప్పను మంత్రి వర్గం నుంచి తప్పించి పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా నియమిస్తారని టీడీపీలో ప్రచారం జురుగుతోంది. అదేసమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళావెంకటరావుకు చినరాజప్ప వద్ద ఉన్న హోం మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా కల్పిస్తారని టాక్. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ కాపు సామాజిక వర్గం వారే కావడంతో ఎక్కడా బ్యాలన్స్ చెడడం లేదు.
ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణీ స్వీకారం చేసిన నారా లోకేష్ తో పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రి వర్గంలో చోటు ఇప్పటికే ఖరారైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఐదారు మందికి ఉద్వాసన తప్పదని మొత్తం పది మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రితో పాటు రాజధాని ప్రాంతానికి చెందిన మరో మంత్రిని సాగనంపేందుకు రంగం సిద్ధమైందని తెదేపాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
* ఎస్టీలో ఒకరికి అవకాశం దక్కవచ్చని అల్ప సంఖ్యాక వర్గం (మైనార్టీ)ల నుంచి మంత్రివర్గ విస్తరణలో ఒకరికి ఖచ్చితంగా అవకాశముంటుందని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పార్టీ సీనియర్ నేత మహ మ్మద్ షరీఫ్‌తో పాటు, వైకాపా నుంచి తెదేపాలో చేరిన చాంద్ భాషా - జలీల్ ఖాన్ లు కూడా మైనార్టీల నుంచి మంత్రి వర్గం లో చోటు కోసం తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
* నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అయిన బీద రవిచంద్రయాదవ్‌కు మంత్రి పదవీ తధ్యమని సమాచారం. ఈ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత - ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం మంత్రి పదవీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనను శాసన మండలి అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తోంది.
* వచ్చే రెండేళ్లలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టిన చంద్రబాబు కొత్తగా మంత్రి వర్గం లోకి తీసుకునే వారిలో యువత ఎక్కువగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. లోకేష్ - అఖిల ప్రియతో పాటు వెనుకబడిన తరగతుల్లోని బలమైన సామాజిక వర్గం యాదవుల నుంచి రవిచంద్ర యాదవ్ కు అవకాశమివ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
* జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వినుకొండ ఎమ్మెల్యే జివి. ఆంజనేయులుకు ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదని సీఎం అంతరంగికులు చెబుతు న్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/