Begin typing your search above and press return to search.

మోడీ యాప్ లో అడిగే ప్రశ్నేలేమంటే..

By:  Tupaki Desk   |   23 Nov 2016 4:27 AM GMT
మోడీ యాప్ లో అడిగే ప్రశ్నేలేమంటే..
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? సగటుజీవి ఎలా స్పందిస్తున్నాడు? అన్న విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నరు. ఇందులో భాగంగా ఆయన ఎవరి మీదా ఆధారపడాలని అనుకోవటం లేదు. సాంకేతికతను నమ్ముకోవటం ద్వారా.. ప్రజల ఫీడ్ బ్యాక్ నేరుగా తానే తెలుసుకోవాలని భావిస్తున్నారు. రద్దుపై నిఘా వర్గాలు.. మీడియాలో వస్తున్నకథనాల్ని పక్కనపెట్టిన ఆయన.. ఒక యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం తెలిసిందే. రద్దుపై ప్రజల స్పందనను ప్రధాని మోడీకి నేరుగా తెలియజేసే వీలుంది. ఇంతకీ ఈ యాప్ లో ఏం చేస్తారన్న విషయానికి వస్తే.. లాగిన్ అయ్యాక.. పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలతో రద్దుపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విషయం ఇట్టే అర్థమయ్యే వీలుంది. పది ప్రశ్నలకు అవును.. కాదు అనే సమాధానం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పే వీలుంది. ఇంతకీ.. యాప్ లో అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అన్న విషయాన్ని చూస్తే..

1. దేశంలో నల్లధనం ఉందని భావిస్తున్నారా?

2. నల్లధనం.. అవినీతిని గుర్తించి దాని ప్రాలదోలాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా?

3. ఈ విషయంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి?

4. అవినీతిపై మోడీ సర్కారు ఇప్పటివరకూ చేస్తున్న ప్రయత్నాలపై మీ రేటింగ్ (ఒకటి నుంచి ఐదు లోపు)

5. వెయ్యి.. రూ.500 నోట్ల రద్దుపై మీఅభిప్రాయం?

6. నోట్ల రద్దుతో నల్లధనం.. అవినీతి.. ఉగ్రవాదాన్ని తీసేయొచ్చా?

7. రద్దు నిర్ణయంతో రియల్ ఎస్టేట్.. ఉన్నత విద్యా.. ఆరోగ్యం సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయా?

8. అవినీతి.. నల్లధనం.. ఉగ్రవాదం.. దొంగనోట్లను ఏరివేయటంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా?

9. కొందరు అవినీతి వ్యతిరేక కార్యకర్తలు నల్లధనం.. అవినీతి.. ఉగ్రవాదానికి మద్దతుగా పని చేస్తున్నారని భావిస్తున్నారా?

10. ఈ విషయంలోప్రధానికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/