Begin typing your search above and press return to search.
పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ?
By: Tupaki Desk | 29 May 2019 7:46 AM GMTఅధికారం ఉన్న చోటే ఎమ్మెల్యేలు ఉండాలి..' అనే రాజకీయ పరిస్థితిని తీసుకొచ్చిన వారిలో చంద్రబాబు నాయుడే ముందుంటారు. గత పర్యాయం అధికారాన్ని చేతిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఎడా పెడా కొనుగోలు చేశారు. అలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని చంద్రబాబు నాయుడు లెక్కలేసుకున్నారు.
అయితే అలాంటిది ఏమీ జరగలేదు. ప్రజలు ఇచ్చిన మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతకు రెట్టింపు స్థాయిలో బలపడింది. అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది.
ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉండటానికి ఎమ్మెల్యేలు రెడీనా? రాబోయే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవడానికి వారిలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిన తీరును చూస్తే..రాబోయే ఐదేళ్లకు అయినా కోలుకుంటుందనే నమ్మకాలు లేకుండా పోయాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడింది. లోకేషేమో ఎమ్మెల్యేగానే ఓడిపోయారు.
ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నడిపించేది ఎవరనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అన్నింటికీ మించి అధికారం చేతిలో లేకపోతే ఎమ్మెల్యేలను నిలుపుకోవడం అంత తేలిక ఏమీ కాదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరినా జగన్ మోహన్ రెడ్డి వారిని చేర్చుకునేలా లేరు. ఆయన ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడేలా ఉన్నారు. జగన్ కు నూటా యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ఏపీ ప్రజలు. కాబట్టి.. ఆయనకు మళ్లీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేదు!
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే వారిని చేర్చుకునేందుకు రెడీగా ఉంది భారతీయ జనతా పార్టీ. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు అటుగా వెళ్తున్నారని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లోకి వెళ్లారని - బీజేపీలోకి చేరితే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. కొన్ని పనులు అయినా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వారు అనుకుంటున్నారని సమాచారం. చంద్రబాబు నాయుడు బీజేపీ మీద ఇటీవలి కాలంలో ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. కాబట్టి ఇదే అదునులో బీజేపీ వారిని చేర్చుకుంటే.. తెలుగుదేశం పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు.