Begin typing your search above and press return to search.
ఆ ఎంపీ చేతిలో 10వేల రెమ్‌డెసివిర్ డోసులు ..కేంద్రానికి నోటీసులు, అరెస్ట్ చేస్తారా?
By: Tupaki Desk | 28 April 2021 10:30 AM GMTదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. సెకండ్ వేవ్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. అలాగే కరోనా బాధితులతో ఆస్పత్రులన్ని ఫుల్ గా కనిపిస్తున్నాయి. అత్యవసర మందుల కొరత, ఆక్సిజన్ కొరత కొనసాగుతుండగా, అధికార బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఎంచక్కా దొడ్డిదారిలో మందులు తెప్పించుకొని, తమ ప్రైవేటు ఆస్పత్రుల్లో విక్రయించుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దేశంలో కరోనా ప్రోటోకాల్ అమలవుతూ, అత్యవసర మందుల్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తంలో ఇంజెక్షన్లు ఎలా వెళుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.
దీనికి వెంటనే సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రంలోని మోదీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. అహ్మద్ నగర్ బీజేపీ ఎంపీ సుజయ్ పాటిల్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ ప్రైవేటు విమానంలో 10వేల డోసుల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను తెప్పించుకున్నారట. ఆ డోసులలో కొన్నిటిని స్థానిక సాయిబాబా ఆస్పత్రికి, మరికొన్నిటిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపిణీ చేసి, మిగతా డోసులను తన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారట. ఎంపీ సుజయ్ మాదిరిగానే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా వ్యక్తిగత హోదాలో అత్యవసర మందుల్ని తెప్పించుకున్నట్లు అయన ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ వివాదంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.అక్రమంగా మందులు తరలించిన ఎంపీని అరెస్టు చేయాలని, అత్యవసర మందుల పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలంటూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ గిరీశ్ కులకర్ణి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టిం. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల వ్యవహారంలో కేంద్రానికి నోటీసులిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపారు.