Begin typing your search above and press return to search.
మాయదారి మహమ్మారి మళ్లీ చెలరేగింది.. రోజులో 10వేల మంది మృతి
By: Tupaki Desk | 15 Aug 2021 3:47 AM GMTకారు మేఘం కమ్ముకొస్తోందన్నట్లుగానే.. అంతకు మించి కరోనా ముప్పు మరోసారి విరుచుకుపడే సంకేతా లు మళ్లీ మొదలయ్యాయి. జూన్ నుంచి నెమ్మదించిన కరోనా.. ఇప్పుడు ఏ క్షణంలో అయినా మన మీదకు విరుచుకుపడే అవకాశం ఉందన్న భయాందోళనలకు గురి చేసేలా పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే. దేశంలో ఇటీవలే రోజుకు 40వేల ప్లస్ కేసులు నమోదు కావటం.. అందులో ఎక్కువ భాగం కేరళ రాష్ట్రంలోనే కావటం తెలిసిందే.
కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అంత ఎక్కువగా కనిపించట్లేదు కరోనా. మన దేశంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటే.. ప్రపంచ వ్యాప్తంగా అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఒక్కరోజులోనే ప్రపంచ వ్యాప్తంగా పది వేల మంది కరోనా కారణంగా మరణిస్తే.. అన్ని దేశాల్లో కలిపి 7 లక్షలకు పైగా కేసులు నమోదు కావటం గమనార్హం. ఇదంతా చూస్తే.. కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నాయనటానికి ఇదో హెచ్చరికగా చెప్పక తప్పదు.
ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అమెరికాలో రోజకు 1.43 లక్షల కేసులు నమోదైతే.. అందులో 660 మంది మరణించినట్లుగా ప్రకటించారు. బ్రిటన్.. ఇరాన్ లలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. జులై 23 తర్వాత పెద్దగా కేసులు నమోదు కాని బ్రిటన్ లో తాజాగా.. రోజువారీ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. రోజులో ఆ దేశంలో 33,074 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్ అని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ ప్రజల్లో 60 శాతం మంది రెండు డోసులు తీసుకోగా.. మిగిలిన వారికి వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిపుణులను కోరుతున్నారు.
ప్రజలు సైతం ఏమాత్రం అలక్ష్యం వద్దని.. కరోనా నిబంధనల్ని పాటించకుంటే మరోసారి తీవ్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా ఉండే న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజే 390 మంది వైరస్ బారిన పడ్డారు. సిడ్నీలో జూన్ 26 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్ లో రోజులో 39వేల కేసులు నమోదు కాగా 568 మంది మరణించారు.
అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్ తో ఉన్న కేసులేనని చెబుతున్నారు. ఈ వేరియంట్ అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ పలు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అవయువ మార్పిడి చేసుకున్న రోగులు.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారికి బూస్టర్ టీకాలు ఇవ్వాలన్న సూచన చేసింది. బూస్టర్ డోసుల అవసరమైన వారు దేశ జనాభాలో మూడు శాతం వరకు ఉంటారని చెబుతున్నారు.
సాధారణ ప్రజలకు ఈ బూస్టర్ డోస్ అందుబాటులో ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. మూడో వేవ్ మొదలైనట్లేనన్న భావన కలుగక మానదు. బ్రిటన్ లాంటి దేశంలో 60 శాతం వ్యాక్సినేషన్ అయ్యాక కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటే.. మనదేశంలో అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాక్సినేషన్ నేపథ్యంలో మనం మళ్లీ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? అన్న సందేహం కలుగక మానదు.