Begin typing your search above and press return to search.
నా కెరీర్ లో 10 నుంచి 12 ఏళ్లు నిద్ర లేని రాత్రులు గడిపా.. సచిన్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 17 May 2021 10:34 AM GMTసచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఎవరెస్ట్ శిఖరం వంటి వాడు. క్రికెట్ లో ఆయన సాధించని రికార్డు అంటూ లేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్నిటా ఆయన రికార్డులు బద్ధలు కొట్టాడు. అందుకే ఆయనను అందరూ క్రికెట్ దేవుడిగా పిలుస్తారు. మరి క్రికెట్ దేవుడికి ఎక్కడైనా కష్టాలు ఉంటాయా.. అంటే ఎవరూ నమ్మరేమో. ఆయన క్రికెట్ కెరీర్ సుదీర్ఘంగా 24 ఏళ్ల పాటు సాగింది. అందులో 10 నుంచి 12 ఏళ్ల పాటు సచిన్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారట. ఎంతో వేదనకు గురయ్యేవారట. సమస్యల కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు తాజాగా ఓ కార్యక్రమంలో సచిన్ వెల్లడించారు. ఆ
సమస్యను ఎదుర్కొనేందుకు ఆటకు ముందే మానసికంగా శారీరకంగా సిద్ధం అవ్వడం నేర్చుకున్నానని, మానసిక ప్రశాంతత కోసం నచ్చిన పనులు చేసేవాడినని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా క్రికెటర్లు నెలల తరబడి బయో బబుల్ లో ఉంటూ మ్యాచ్ లు ఆడాల్సి వస్తోంది. ఇది వారికి ఎంతో కష్ట తరంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ అకాడమీ ఆధ్వర్యంలో యువతరం ఆటగాళ్లకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ అతిథిగా పాల్గొని మాట్లాడారు.
'నేను మైదానంలో అడుగుపెట్టే ముందు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. ఆ సమయంలో మానసికంగా బలంగా ఉండేందుకు నా మైండ్ సెట్ ని డైవర్ట్ చేసేందుకు వివిధ పనులు చేసేవాడిని. టీ కాచుకోవడం, బట్టలు ఐరన్ చేయడం, బ్యాగ్ సర్దుకోవడం వంటి పనులు చేస్తూ మనసును తేలిక పరచుకునేవాడిని.
నా కెరీర్ కొనసాగినంత కాలం ఒత్తిడి ఎదురైనప్పుడల్లా నా మనసును దృష్టి మరల్చే పనులు చేసేవాడిని. ఏ విషయమైనా సరే మన మనసు అంగీకరించేలా మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఎటువంటి సమస్య ఎదురైనా ఒత్తిడిని తట్టుకుని జయించగలం. జీవితం అంటే పూలపాన్పు కాదు. ఎవరి జీవితంలో అయినా ఓటములు, విజయాలు ఉంటాయి. అన్నింటినీ ఒకేలా స్వీకరించినప్పుడే ఎటువంటి సమస్యనైనా దానిని ఎదుర్కొనే శక్తి వస్తుంది' అని సచిన్ యువతరం ఆటగాళ్లకు తన మాటలతో ధైర్యం నింపారు.