Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో అమ్మాయి అబ్బాయిని రేప్ చేసింది
By: Tupaki Desk | 27 Jun 2016 7:03 AM GMTరకరకాల దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరో దారుణానికి వేదిక అయ్యింది. రోటీన్ కు భిన్నంగా అన్నట్లు.. రోజు వినిపించే అత్యాచార దారుణాలకు రివర్స్ గా తాజా ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం. అబ్బాయిల చేతిలో అమ్మాయిలు అత్యాచారానికి గురి అవుతుంటారు.కానీ.. తాజాగా ఘటనలో ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి అత్యాచారానికి పాల్పడింది. ఈ ఘటనలో సదరు కుర్రాడు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
కాన్పూర్ కు సమీపంలోని కుల్హౌలి గ్రామానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి తన పక్కింట్లో ఉండే అబ్బాయికి మాయ మాటలు చెప్పింది. పదేళ్ల చిన్న కుర్రాడైన అతడితో బలవంతంగా శృంగారానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కుర్రాడి సున్నిత భాగాలు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తస్రావం కావటంతో అతడ్ని హుటాహుటిన కాన్పూర్ లోని ఆసుపత్రిలో చేర్చారు.
ఈ ఉదంతం ఆ నోటా.. ఈ నోటా దాటి పోలీసుల దృష్టికి వెళ్లింది. అదే సమయంలో బాలుడి తల్లిదండ్రులు సైతం పోలీసుల్నిఆశ్రయించటంతో బాలిక తల్లిదండ్రులు.. బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇద్దరూ మైనర్లే కావటం.. రోటీన్ కు భిన్నంగా జరిగిన ఈ ఉదంతంతో ఏం చేయాలో అర్థం కాక సదరు పోలీసులు షాక్ తిన్న పరిస్థితి. ఏ సెక్షన్ కింద ఇలాంటి నేరాల్ని నమోదు చేయాలో అర్థం కాక రూల్ బుక్ తిరగేస్తున్నారట. అయితే.. న్యాయ నిపుణులు మాత్రం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణగా నిలిచే పోస్కో చట్టంలోని సెక్షన్ 8 కింద కేసు నమోదు చేయొచ్చని చెబుతున్నారట. చూస్తుంటే.. అబ్బాయిల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాడు రోజులు వచ్చేశాయన్న మాట.