Begin typing your search above and press return to search.

దుబాయ్ లో భారతీయుడికి పదేళ్ల జైలు

By:  Tupaki Desk   |   7 March 2019 3:30 PM GMT
దుబాయ్ లో భారతీయుడికి పదేళ్ల జైలు
X
భారతీయుడికి దుబాయ్ లో పదేళ్ల జైలు శిక్ష పడింది. దుబాయ్ లోకి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చాడని పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. దుబాయ్ కోర్టు తాజాగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడికి దాదాపు 10 లక్షల జరిమానా కూడా విధించింది. జైలు శిక్ష పూర్తికాగానే అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని జప్తు చేయాలని కోర్టు చెప్పింది.

గత అక్టోబర్ లో విజిటింగ్ వీసాపై భారత్ నుంచి దుబాయికి వెళ్లిన భారతీయుడిని దుబాయ్ ఎయిర్ పోర్టులో అధికారులు చెక్ చేశారు. అతడి బ్యాగులోని జీన్స్ ప్యాంట్లలో నాలుగు గంజాయి పొట్లాలను గుర్తించారు. అవి తన బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో తెలియదని బాధితుడు మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. గంజాయి సరఫరా చేస్తున్నాడని పోలీసులకు అప్పగించారు.

అప్పటి నుంచి విచారణ ఎదుర్కొంటున్న భారతీయుడికి తాజాగా మార్చి 6న కోర్టు తీర్పు వెలువరించింది. దుబాయ్ లోని మరో వ్యక్తికి సరఫరా చేయడానికే ఈ గంజాయిని నిందితుడు తెచ్చినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో పదేళ్ల జైలుశిక్ష, 10లక్షల జరిమానా బాధితుడికి పడింది.