Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ పై 100 కోట్ల పరువునష్టం దావా!
By: Tupaki Desk | 28 Oct 2018 8:14 AM GMTసంచలన అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చే తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా కేటీఆర్ బావమరిది అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షించాయి. కేటీఆర్ మీద ఉన్న ఆగ్రహం కావొచ్చు.. ఆయన బావమరిదిని ఆరోపణల బోనులో నిలబెట్టానన్న ఆవేశంతో కావొచ్చు.. తాను చెప్పానులనుకున్న దానికి కాస్తంత మసాలా కలిపి మరీ హడావుడి చేసిన వైనంపై అందరి దృష్టి పడింది.
శనివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సన్సేషన్ రైజ్ పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ వచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ ఈవెంట్‌లో పాల్గొనటానికి హైదరాబాద్‌కు వచ్చినోళ్లు ఎందరో.
అధికారికంగా టికెటింగ్ పార్టనర్ గా వ్యవహరించినా.. అనధికారికంగా అంతా తానై నిర్వహిస్తున్నది బహిరంగ రహస్యంగా చెప్పాలి. లేకుంటే.. ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించటం అంత తేలికైన విషయం కాదు. ఇదిలా ఉంటే..ఈ ఈవెంట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.
దీనిపై కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ సంస్థ స్పందిస్తూ.. రేవంత్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. వాటిని వెనక్కి తీసుకోవాలని లేదంటే రూ.100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే.. రేవంత్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. ఇక.. నిన్న రాత్రి (శనివారం) నిర్వహించిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. కాకుంటే.. మధ్యలో కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు కాసింత హడావుడి చేయటం.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించటం.. ఆ తరవాత వదిలేయటంలాంటివి జరగాయి
శనివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సన్సేషన్ రైజ్ పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ వచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ ఈవెంట్‌లో పాల్గొనటానికి హైదరాబాద్‌కు వచ్చినోళ్లు ఎందరో.
దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ ఈవెంట్ కోసం సంపన్న కుటుంబాలు నిన్న రాత్రి గచ్చిబౌలి స్టేడియంకు క్యూకట్టాయి. పొట్టి పొట్టి డ్రెస్సులతో.. వైట్ అండ్ వైట్ కాన్సెప్ట్ తో సాగిన ఈ ఈవెంట్ ను కేటీఆర్ బావమరిదికి చెందిన ఈవెంట్స్ నౌ సంస్థ టికెటింగ్ పార్టనర్ గా మాత్రమే వ్యవహరిస్తోంది.