Begin typing your search above and press return to search.

మ్యాప్ గీయాలంటే ఇక లైసెన్స్ ఉండాల్సిందే..

By:  Tupaki Desk   |   7 May 2016 10:22 AM GMT
మ్యాప్ గీయాలంటే ఇక లైసెన్స్ ఉండాల్సిందే..
X
ఇంట‌ర్‌ నెట్‌ లో మ్యాప్‌ లు చూడాలంటే వెంట‌నే మ‌నం ఆధార‌ప‌డేది గూగుల్ పైనే. ఈ దిగ్గ‌జ సెర్చ్ ఇంజిన్ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డింది. ఇప్ప‌టిదాకా ఎలాంటి అనుమ‌తులు లేకుండానే దేశాల చిత్ర ప‌టాల స‌మాచారం చూపిస్తున్న గూగుల్ ఇక‌పై లైసెన్స్ ఉంటేనే ఈ స‌మాచారం చూపించాల్సిన ప‌రిస్థితి. ఇటీవ‌ల మ్యాప్‌ల‌ను చూపించ‌డంలో ట్విట‌ర్ ఘోర త‌ప్పిదం చేయ‌డంతో గూగుల్ కూడా ఇబ్బంది వ‌చ్చిప‌డింది.

జ‌మ్ము క‌శ్మీర్‌ ను పాకిస్థాన్‌ లో ఉన్న‌ట్లు చూపించిన ట్విట‌ర్‌.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ ను చైనాలో ఉన్న‌ట్లు చూపించ‌డంతో వివాదం త‌లెత్తింది. జియోస్పాటియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ రెగ్యులేష‌న్ యాక్ట్ 2016 ప్ర‌కారం ఏ సైట్ అయినా మ్యాప్‌ ల‌ను చూపించాలంటే ఆ సైట్‌కు క‌చ్చితంగా లైసెన్స్ ఉండాలి. 2014లో భార‌త మ్యాప్‌ ను గూగుల్ తప్పుగా చూపించింది. ఈ నేప‌థ్యంలో ఇలా దేశం మ్యాప్‌ ను త‌ప్పుగా చూపిస్తే ఈ బిల్ ప్ర‌కారం శిక్ష‌కు గుర‌వ్వాల్సిందే.

జియోస్పాటియ‌ల్ స‌మాచారాన్ని ఇవ్వాలంటే సెక్యూరిటీ వెట్టింగ్ అథారిటీకి ముందుగా ఒక అప్లికేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాప్‌ ల గురించి స‌మాచారం ఇవ్వాలంటే ఏడాదిలోపు ఈ అప్లికేష‌న్ అథారిటీకి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. లైసెన్స్ వ‌చ్చిన త‌ర్వాతే త‌మ సైట్ లో జియోస్పాటియ‌ల్ స‌మాచారం ఇవ్వొచ్చు.

ఒక వేళ ఈ జియోస్పాటియ‌ల్ స‌మాచారాన్ని త‌ప్పుగా చూపించినా, ప్ర‌చురించినా.. ఏడేళ్ల జైలుతో పాటు రూ.100 కోట్ల జ‌రిమానా దాకా విధించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. స్పేస్ నుంచి గాని - ఎయిర్‌ క్రాప్ట్‌ - ఎయిర్‌ షిప్స్‌ - బెలూన్స్‌ - గుర్తు తెలియ‌ని ఏరియ‌ల్ యంత్రాల ద్వారా మ‌న జియోస్పాటియ‌ల్ స‌మాచారం అనుమ‌తి లేకుండా గ్ర‌హించ‌డం కూడా త‌ప్పేన‌ని ఈ చ‌ట్టం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మ్యాప్‌ ల‌ను చూపించ‌డంలో ముందుండే గూగుల్ సంస్థ‌కు ఇక‌పై అనుమ‌తి లేకుండా భార‌త్‌ లో ఎలాంటి జియోస్పాటియ‌ల్ వివ‌రాలు ఇవ్వ‌కూడ‌దు.