Begin typing your search above and press return to search.

100 మంది 'బాలిక‌ల' ప్రేమ పెళ్లి!!

By:  Tupaki Desk   |   5 April 2016 7:44 AM GMT
100 మంది బాలిక‌ల ప్రేమ పెళ్లి!!
X
ప్రేమ పెళ్లిల‌ను త‌ప్పుప‌ట్ట‌డం అనేది వారి వారి ఆలోచ‌న‌, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంది. అయితే తెలిసీ తెలియ‌ని త‌నం - మాన‌సిక‌ - శారీర‌క ప‌రిప‌క్వ‌త లేక‌పోవ‌డం వ‌ల్ల చేసే ప‌నుల‌ను చూస్తే బాధ‌క‌ల‌గ‌డమే కాదు ఒకింత కోపం రావ‌డం స‌హజం. ఇంత‌కీ అంత కోపం జ‌రిగే విష‌యం ఏంటంటే.... ఇంట‌ర్ చ‌దువుతున్న అమ్మాయిలు "వెళ్లిపోయారు". అదికూడా ఏకంగా వంద‌మంది! పైగా ప‌రీక్ష రాసిన‌ వెంట‌నే జంప్‌!!

పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో ఈ షాకింగ్ ఎపిసోడ్ జ‌రిగింది. ఇంటర్ పరీక్షల చివరి రోజున పరీక్షలు రాసేందుకు వెళ్లిన అమ్మాయిల్లో ఒకేరోజు వంద మంది మిస్ అయ్యారు. గత శుక్రవారం జరిగిన‌ ప్లస్ టూ ఎగ్జామ్స్ చివరి పరీక్ష రోజు వంద మంది అమ్మాయిలు త‌ప్పిపోయార‌ని తేలింది. అయితే వీళ్లు త‌ప్పిపోలేద‌ని 'వెళ్లిపోయార‌ని' తెలుస్తోంది. అలా ఎలా చెప్పేస్తారంటే...గత ఏడాది కూడా సేమ్ సీన్ రిపీట‌యింది కాబ‌ట్టి. ఇలాగే ఇంట‌ర్ సెకండియ‌ర్ పూర్త‌యిన అమ్మాయిలు ప‌రీక్ష చివరి రోజ 125 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు వెతుకులాట మొదలెట్ట‌గా అందులో మెజార్టీ బాలిక‌లు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నార‌ని తేలింది. దీంతో ఇపుడు కూడా అదే జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇంట‌ర్ సెకండియ‌ర్ పూర్త‌యిన అమ్మాయిలు చేసిన ఈ ఘ‌న‌కార్యంతో పేరెంట్స్ షాక్‌ కు గుర‌వుతున్నారు. పోలీస్ స్టేష‌న్‌ లో కంప్లైంట్లు చేసి త‌మ పిల్ల‌ల కోసం వెతకాల‌ని వాపోతున్నారు. ఈ బాలికల జంపింగ్ ఎపిసోడ్ జంటలుగా రావ‌డంతో ఫుల్‌ స్టాప్ ప‌డుతుందా? లేక కొత్త ట్విస్ట్ ఏమైనా తెర‌మీద‌కు వ‌స్తుందా? వేచి చూడాల్సిందే!