Begin typing your search above and press return to search.
ఇక.. ఏపీ బస్టాండ్లలో ‘‘బుజ్జి థియేటర్లు’’
By: Tupaki Desk | 2 Oct 2015 4:42 AM GMTసరికొత్త కాన్సెప్ట్ ఒకటి ఏపీలో వచ్చేస్తోంది. సగటు తెలుగువాడికి అత్యంత కామన్ ఇంట్రస్ట్ లలో ఒకటైన సినిమా మరింత దగ్గరకు కానుంది. ఏపీలోని ఏప్రాంతంలో అయినా.. బస్టాండ్ లలో అయినా ఒక మినీ థియేటర్ ను ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కారు పచ్చ జెండా ఊపేసింది. ఏపీ వ్యాప్తంగా బస్టాండ్ల లో ఈ బుజ్జి థియేటర్లను ఏర్పాటు చేస్తారు.
కాఫీ టాకీస్ అనే సంస్థ ప్రతిపాదించిన ఈ మినీ థియేటర్లకు ఏపీ సర్కారు ఓకే చెప్పేసింది. 130 మంది కెపాసిటీతో నిర్మించే ఈ థియేటర్లను ఏపీ వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లలో నిర్మించే ఆలోచనలో ఉన్నారు. తొలిదశలో ఏపీలో 52 బస్టాండ్లలో ఈ బుజ్జి థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. పెద్ద పెద్ద థియేటర్లు ఏ మాత్రం వర్క్ వుట్ కాక.. ఫంక్షన్ హాళ్లుగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సరికొత్త కాన్సప్ట్ తో ఈ బుజ్జి థియేటర్లు ముందుకు రానున్నాయి.
బస్టాండ్లతో పాటు.. కమ్యూనిటీ హాళ్లు.. పార్కుల వద్ద కూడా ఈ బుజ్జి థియేటర్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఏపీతో పాటు.. తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. ఈ మినీ థియేటర్లలో టిక్కెట్టు ధర రూ.50 నుంచి రూ.80 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. బస్సుల కోసం వెయిట్ వేసేవారు.. ఓ మూడు గంటల టైం ఉందంటే.. జర్నీకి ముందే ఒక సినిమా చూసేయొచ్చన్న మాట. మరి.. ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందోచూడాలి.