Begin typing your search above and press return to search.
ఖర్చు చేసే ప్రతి వందా రూ.లక్షతో సమానం
By: Tupaki Desk | 10 Nov 2016 3:53 AM GMTపెద్ద నోట్ల రద్దు.. చిన్న నోట్లు.. కొత్తగా చెల్లుబాటు అయ్యే నోట్లకు సంబంధించిన పరిమితులు అమలవుతున్న వేళ.. దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ అలవాట్లను ఒక్కసారిగా మార్చుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ప్రకారం.. పెద్దనోట్లను కొత్త నోట్లకు.. చిన్న నోట్లకు మార్చుకోవటానికి.. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవటానికి పరిమితులు విధించిన నేపథ్యంలో ఖర్చుల విషయంలో ప్రతిఒక్కరూ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఏమాత్రం తేడాగా ఖర్చు చేసినా అసలుకే ఎసరు అని చెప్పక తప్పదు. చేతిలో ఉన్న చిన్న నోట్లు.. కొత్తగా ఇచ్చే నోట్లను అనవసర ఖర్చులకు ఖర్చు పెడితే అవసరానికి డబ్బులు ఇచ్చే వారు కూడా ఉండరన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిన్నటి వరకూ అత్యవసరమైతే అప్పుగా ఇచ్చే వారు ఉండేవారు. తాజాగా మారిన పరిణామాలతో ఇప్పుడు చేబదులుతో సహా అప్పు ఇచ్చే వారు సైతం కనిపించని పరిస్థితి. ఇప్పుడు అందరి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉందని చెప్పాలి.
డబ్బుల్లేని వాడికి.. డబ్బులున్నోడికి మధ్య అంతరం భారీగా తగ్గిపోయిన వేళ.. ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు చేయాలి. వీలైనంతవరకే నగదు చెల్లించే వ్యవహారాలకు దూరంగా ఉండటం.. కార్డులతో చెల్లింపులు జరిపే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు అన్నది మర్చిపోకూడదు. చేతిలో ఉన్న కాసిన్ని డబ్బులు అయిపోతే.. తిరిగి తీసుకునే మార్గాలు తక్కువగా ఉండటం.. అవి కూడా పరిమితులకు లోబడి ఉన్న నేపథ్యంలో ఖర్చు చేసే ప్రతి వంద రూపాయిలు లక్షరూపాయిలతో సమానమన్నట్లుగా వ్యవహరించక తప్పని పరిస్థితి. లేదంటే.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/