Begin typing your search above and press return to search.
అమరనాథ్ యాత్రలో 6కు చేరిన మృతుల సంఖ్య!
By: Tupaki Desk | 3 July 2018 12:52 PM GMTతీవ్రమైన మంచు - వర్షం ప్రభావంతో పాటు ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 1500 మంది భారతీయ యాత్రికులు నేపాల్-చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 100 మంది యాత్రికులు పితోర్ ఘర్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అమరనాథ్ యాత్రలో మంగళవారం నాడు ఇద్దరు తెలుగు వారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. బలకేజ్ బేస్ క్యాంప్ లో ఉండగా హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమె మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాధా కృష్ణ శాస్త్రి కూడా గుండెపోటుతో మరణించారు. అంతకుముందు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వారిద్దరితోపాటు కేరళకు చెందిన మరో యాత్రికుడు - బీఎస్ ఎఫ్ సిబ్బంది ఒకరు - ఉత్తరాఖండ్ కు చెందిన మరో వ్యక్తి కూడా ఈ మానస సరోవర యాత్రలో వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో, ఇప్పటివరకు ఈ యాత్రలో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయం అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణకు చెందిన యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేసీఆర్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు, అక్కడ చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రంగంలోకి దిగిన బీఎస్ ఎప్ ...సహాయక చర్యల్లో నిమగ్నమైంది. కాఠ్మండూలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సంప్రదింపులు జరిపారు. అధికారులతో మాట్లాడి....సహాయక చర్యలను ఆమె పర్యవేక్షిస్తున్నారు.