Begin typing your search above and press return to search.

మోడీకి హంగ్, జగన్ కి సెంచురీ !

By:  Tupaki Desk   |   7 April 2019 7:24 AM GMT
మోడీకి హంగ్, జగన్ కి సెంచురీ !
X
జనం జగన్ వైపే ఉన్నారని మరో జాతీయ సర్వే తేల్చింది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సంస్థతో కలిపి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలోని వైెస్సార్ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయట. తెలుగుదేశం పార్టీకి 45 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు, బీజేపీకి మూడు సీట్లు, ఇతరులకు 23 సీట్లు వస్తాయని ఇండియా టీవీ ఎక్స్ సర్వే లో తేలింది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే... వైసీపీకి 18 - టీడీపీకి ఏడు ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించింది.

మరోవైపు బీజేపీ జాతీయ స్థాయిలో బలంగానే ఉందని, మోడీ వ్యూహాలు బాగా ఫలిస్తున్నాయని తెలుస్తోంది. అయితే, గతంలో కంటే 42 సీట్లు తక్కువగా వస్తాయని తెలిపింది. గత ఏడాది బీజేపీకి 282 సీట్లు రాాగా, ఈసారి 230 సీట్లే వస్తాయట. కాకపోతే ప్రీపోల్ అలయన్స్ లో ఉన్న ఎన్డీయే 275 సీట్లతో తానే అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ బలం భారీగా పుంజుకుని రెట్టింపు అయినా... 97 సీట్ల వద్దే ఆగిపోతుందని ఈ సర్వే చెబుతోంది. కాకపోతే యూపీ ఏ కూటమికి 147 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అంటే యూపీ ఏ అధికారంలోకి రావాలంటే... ఎన్డీయేతర పార్టీలన్నీ మద్దతు ఇచ్చినా కుదరదు అన్నమాట.

ఈ సర్వే ను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కలిపి 327 సీట్లు వస్తాయి. మిగతా అన్ని పార్టీలకు కలిపి 216 సీట్లు వస్తాయని అర్థమవుతోంది. ఈ 216లో కొన్ని ఇప్పటికే ఎన్డీయూ కూటమిలోఉండగా, కొన్ని యూపీఏ కూటమిలో ఉన్నాయి. ఈ కూటముల్లో లేని పార్టీలకు అన్నింటికీ కలిపి గంపగుత్తగా వచ్చే సీట్లు 121 మాత్రమే అని తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీలకు బీజేపీ ఎయిర్ స్ట్రైక్ వల్ల ఢిల్లీలో ఏడు సీట్లు బీజేపీకి వస్తాయని ఈ సర్వేలో ఢిల్లీ ప్రజలు చెప్పారట. ఇక ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే తృణమూల్ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఆ పార్టీకి 28 సీట్లు వస్తాయట. కలిసి పోటీచేస్తున్న ఎస్పీకి 15 - బీఎస్పీకి 14 సీట్లు వస్తాయట. వైసీపీకి 18 - టీఆరెస్ కు 12 - బీజేడీకి 14 - కమ్యూనిస్టులకు 8 సీట్లు వస్తాయట.

ఒడిసాలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఏపీతో పాటు జరుగుతున్నాయి. ఇక్కడ 147 సీట్లకు గాను 100 సీట్లు గెలిచి బీజేడీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే తేల్చింది. బీజేపీకి 31 - కాంగ్రెస్కి 9 సీట్లు రానున్నాయి.

ఇక ఈ సర్వే శాంపుల్స్ గమనిస్తే... మొత్తం 543 నియోజకవర్గాల్లో మార్చి 24 - 31 తేదీల మధ్యన సర్వే చేశారు. 65160 శాంపిల్స్ తో ఈ సర్వే చేశారు.