Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌ లో ఆ రికార్డు.. ప్ర‌జ‌ల‌కు చిరాకు

By:  Tupaki Desk   |   2 Nov 2021 9:40 AM GMT
హుజూరాబాద్‌ లో ఆ రికార్డు.. ప్ర‌జ‌ల‌కు చిరాకు
X
ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి కి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న‌ప్ప‌టి నుంచి తెలంగాణ‌ లో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజ‌యం కోసం ఈట‌ల రాజేంద‌ర్, టీఆర్ఎస్ అధినేత సీఎం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా ప్ర‌య‌త్నించారు. ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్‌ గా పోటీ సాగ‌డం తో పాటు ఈట‌ల‌ తో పాటు కేసీఆర్‌ కూ ఈ ఉప ఎన్నిక ప్ర‌తిష్ఠాత్మ‌కం కావ‌డం తో హోరా హోరీ ప్ర‌చారం సాగించారు. ఈ ఉప ఎన్నిక‌ లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందోన‌ని ఆస‌క్తి అంద‌రి లోనూ నెల‌కొంది. దీంతో నోటిఫికేష‌న్ రాక ముందు నుంచే అక్క‌డ ప్ర‌జ‌ల నాడీ తెలుసుకునేందుకు రాజ‌కీయ పార్టీల తో పాటు వివిధ సంస్థ‌లు స‌ర్వేలు మొద‌లెట్టాయి. పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా రెండు రోజుల పాటు వివిధ సంస్థ‌లు అక్క‌డ స‌ర్వే నిర్వ‌హించాయ‌ని తెలిసింది. దీంతో రికార్డు స్థాయి లో ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మునుపెన్న‌డూ లేని విధం గా 100కు పైగా స‌ర్వేలు నిర్వ‌హించార‌ని తెలిసింది.

ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం గ‌ట్టి గా ప్ర‌య‌త్నించిన టీఆర్ఎస్‌, బీజేపీ.. ఓట‌ర్లు ఎటు వైపు ఉన్నారో తెలుసుకునేందుకు స‌ర్వేలు నిర్వ‌హించాయి. దీంతో పాటు కొన్ని ప్రై వేటు సంస్థ‌లు, మీడియా సంస్థ‌లు కూడా స‌ర్వేలు జ‌రిపాయి. ఇలా స‌ర్వేల కోసం త‌ర‌చూ వ‌చ్చి విసిగిస్తుండ‌డం తో అక్క‌డి ప్రజ‌లు చిరా కు ప‌డ్డార‌ని తెలిసింది. పోలింగ్ త‌ర్వాత కూడా కొన్ని స‌ర్వే ఏజెన్సీలు ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం తో వాళ్లు అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం తో పాటు వెళ్లి పొమ్మ‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ స‌ర్వేల వెన‌క కూడా వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్న కొంత‌ మంది నాయ‌కులు ఈ స‌ర్వే ఫ‌లితాల ద్వారా త‌మ కెరీర్‌ పై ఓ నిర్ణ‌యం తీసు కోవాల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది. మ‌రో వైపు రాజ‌కీయ ల‌క్ష్యాలు క‌లిగిన పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపార సంస్థ‌లు కూడా ఈ స‌ర్వేల ద్వారా ప్ర‌జ‌ల ఉద్దేశాన్ని తెలుసుకుని ఆ పార్టీ కి మ‌ద్ద‌ తు ప్ర‌క‌టించేందు కు సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. ఇలాంటి స‌ర్వేల ఫ‌లితాల‌ను బ‌య‌ట‌ కు చెప్ప‌కుండా త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే వాడుకుంటున్న‌ట్లు తేలింది. మ‌రికొంత మంది స‌ర్వేల ద్వారా గెలిచే అభ్య‌ర్థి పై ఓ అంచ‌నాకు వ‌చ్చి.. అత‌ని పై భారీ స్థాయి లో బెట్టింగ్ నిర్వ‌హించి లాభ‌ప‌డాల‌ని చూశారు. ఇటీవ‌ల కాలం లో అత్య‌ధిక బెట్టింగ్ జ‌రిగిన ఎన్నిక‌ గా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిలిచింద‌ని చెప్తున్నారు.

మ‌రో వైపు ప్ర‌జ‌ల మూడ్‌ ను తెలుసుకుని.. వాళ్ల‌ ను త‌మ వైపు తిప్పు కునేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్ర‌య‌త్నించిన‌ట్లు స‌మా చారం. ఓ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడి చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ రెండు పార్టీలు క‌లిపి ఏకంగా 35 స‌ర్వేలు నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. నోటిషికేష‌న్ రాక‌ ముందు.. ఎన్నిక‌ల తేదీ విడుద‌ల‌య్యాక‌.. నామినేష‌న్లు వేశాక‌.. ప్ర‌చారం ముగిశాక‌.. ఇలా వేర్వేరు ద‌శ‌ల్లో ఈ సర్వేలు నిర్వ‌హించార‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెప్తున్నారు. మొత్తాని కి ఎన్నిక‌ల స‌ర్వేల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ కొత్త ట్రెండు సృష్టించింద‌ని చెప్పు కోవ‌చ్చు.