Begin typing your search above and press return to search.
తమిళనాడు తీరంలో కలకలం
By: Tupaki Desk | 21 April 2021 4:30 PM GMTతమిళనాడులో భారీ డ్రగ్స్ బయటపడడం సంచలనమైంది. ఏకంగా రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. ఇంత భారీ మొతత్ంలో డ్రగ్స్ దొరకడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. సంచుల్లో కుప్పలుగా కొకైన్ చూసి అవాక్కయ్యారు.
తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవోసి పోర్టుకు శ్రీలంక నుంచి ఓ బోటు వచ్చింది. అది అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. బోటులో కలపను తీసుకొచ్చారు. పైకి దుంగలు కనిపించాయి. వాటి కింద సంచుల నిండా కొకైన్ కనిపించింది.
పడవలో కలప కింద తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో కొకైన బయటపడింది. సంచుల్లో ఉన్న కొకైన్ 400 కేజీలు ఉంటుందని తేలింది. అంతర్జాతీయ మార్కెట్ లో వాటి విలువ రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలించారు? ఎవరున్నారన్న కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీలంక నుంచి వస్తున్న పడవల వల్లే డ్రగ్స్ బయటపడుతున్నాయి. ఇటీవల కేరళ తీరంలోనూ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. శ్రీలంక నుంచే డ్రగ్స్ మనదేశంలోకి వస్తున్నట్టు తెలుస్తోంది.