Begin typing your search above and press return to search.

కోహ్లీ సేన ఓట‌మితో వెయ్యికోట్లు ఆవిరి?

By:  Tupaki Desk   |   11 July 2019 7:42 AM GMT
కోహ్లీ సేన ఓట‌మితో వెయ్యికోట్లు ఆవిరి?
X
క‌నిపించే ఆట వెనుక క‌నిపించ‌ని ఆట‌లెన్నో ఉంటాయి. క్రికెట్ ను ఆట‌ను చూసే అభిమానులు ఉన్న‌ట్లే.. దాంతో సొమ్ము చేసుకోవాల‌నుకునే ఆశావాహులెంద‌రో. టీమిండియా ఆడే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి బెట్టింగులు సాగ‌టం పాత విష‌య‌మే. తాజాగా జ‌రిగిన వ‌రల్డ్ క‌ప్ సెమీస్ లో ఓట‌మిపాలైన టీమిండియా కార‌ణంగా ల‌క్షలాది మంది వంద‌ల కోట్లు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని వార్తా ఏజెన్సీల స‌మాచారం ప్రకారం బెట్టింగుల్లో టీమిండియా గెలుపుపై భారీగా డ‌బ్బులు పెట్టిన వారంతా దారుణంగా దెబ్బ తిన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో అత్య‌ధిక భాగంగా కోహ్లీ సేన గెలుస్తుంద‌న్న దాని మీద‌నే పందెం పెట్టారు. అలాంటి వారంతా దారుణంగా దెబ్బ తిన్నారు. కొంద‌రు మాత్రం రిస్క్ తీసుకొని కివీస్ విజ‌యం సాధిస్తుంద‌ని బెట్టింగ్ పెట్టినోళ్లు మాత్రం భారీగా ప్ర‌యోజ‌నం పొందిన‌ట్లుగా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా ఈ మ్యాచ్ మీద సాగిన బెట్టింగులు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర వెయ్యి కోట్ల వ‌ర‌కూ ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

మొద‌టి రోజు కివీస్ ఆడిన ఆట‌.. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆగిపోవ‌టం.. త‌క్కువ ప‌రుగుల‌కే స్కోర్ చేయ‌టంతో.. ఈ మ్యాచ్ లో భార‌త్ గెలుపు లాంఛ‌న‌మే అన్న‌ట్లుగా మీడియా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీనికి త‌గ్గ‌ట్లే పంట‌ర్లు సైతం పెద్ద ఎత్తున టీమిండియా విజ‌యం మీద బెట్టింగ్ కాశారు. ఎప్పుడైతే.. తొలి మూడు ఓవ‌ర్ల‌లో వికెట్లు ట‌ప‌ట‌ప రాలిపోయాయో.. అప్ప‌టికే భార‌త్ విజ‌యం మీద ఆశ‌లు కోల్పోయారు. దాంతోనే తాము పెట్టిన బెట్టింగ్ సొమ్ము ఆవిరి కావ‌టంతో ల‌క్ష‌లాది మంది భారీ న‌ష్టానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు.

అన‌ధికారికంగా సాగే ఈ బెట్టింగ్ వ్యాపారం గుట్టుగా సాగుతుంద‌న్న విష‌యం తెలిసిందే. కొంద‌రు జ‌ట్టు విజ‌యం మీద పెడితే.. మ‌రికొంద‌రు స్టార్ బ్యాట్స్ మెన్ల (కోహ్లీ.. రోహిత్..) వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న మీద కూడా భారీగా బెట్టింగులు సాగిన‌ట్లుగా తెలుస్తోంది. కోహ్లీ.. రోహిత్ లు సెంచ‌రీలు చేస్తార‌ని పెద్ద ఎత్తున బెట్టింగులు సాగాయి. ఆస‌క్తిక‌రంగా న్యూజిలాండ్ బ్యాట్స‌మెన్ల మీద కూడా ఇదే త‌ర‌హాలో బెట్టింగులు పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

బ్యాట్స్ మెన్ల‌తో పాటు బౌల‌ర్లు మూడు వికెట్లు తీసే వారు వీరే నంటూ ప‌లువురు భార‌త్.. న్యూజిలాండ్ క్రీడాకారుల మీద భారీగా బెట్టింగులు సాగాయ‌ని చెబుతున్నారు. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమంటే..టీమ్ గెలుపు మీద పెట్టిన బెట్ల‌తో పాటు.. క్రీడాకారుల వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ మీద పెట్టిన బెట్టింగుల్లోనూ తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని చెప్పాలి. మొత్తానికి కోహ్లీ సేన ఓట‌మి ల‌క్ష‌లాది కుటుంబాల్లో దారుణ‌మైన ఆర్థిక న‌ష్టాన్ని చేకూర్చిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.