Begin typing your search above and press return to search.

రద్దు నోట్లను టన్నుల లెక్కన అమ్మేస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Dec 2016 5:55 AM GMT
రద్దు నోట్లను టన్నుల లెక్కన అమ్మేస్తున్నారు
X
సరిగ్గా నెల కిందట పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల సంగతి తెలిసిందే. నోట్ల రద్దు మాట బయటకు వచ్చిన వెంటనే.. చేతిలో ఉన్న పెద్దనోట్లను ఎవరికి వారు తమకు తోచిన వైనంలో బ్యాంకులకు వెళ్లేలా చేశారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే రూ.వెయ్యి.. రూ.500 నోట్లు ఆర్ బీఐకి చేరుకుంటున్నయి. మరింత భారీగా వచ్చి పడిన నోట్లను ఏం చేస్తారన్న సందేహం పలువురికి వచ్చి ఉంటుంది.

మనసులోని డౌట్ ను తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నోట్లను తలుపులు తయారు చేసే వుడ్ పరిశ్రమలో వుడ్ తయారీ మిశ్రమంలో ఈ పాతనోట్లను వినియోగిస్తారు. దీంతో.. ఆ నోట్లను తలుపులు తయారు చేసే కంపెనీకి టన్నుల లెక్కన అమ్ముతున్నారు. కేరళకు చెందిన వెస్ట్రన్ ఇండియా ఫ్లైవుడ్ అనే కంపెనీ రద్దైన నోట్లను కొనుగోలు చేస్తోంది.

మరి.. ఈ నోట్ల అమ్మకం ఎలా ఉంటుంది? ఎలా అమ్ముతారు? ఏ రేటుకు అమ్ముతారు? అన్న సందేహాలకు సమాదానాలు వెతికితే.. కాస్తంత ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు ఎంతో విలువైన నోట్లను కారు చౌకగా అమ్ముతారనే చెప్పాలి. టన్ను రద్దు నోట్లను కేవలం రూ.250 చొప్పున మాత్రమే అమ్ముతారట. పేరుకు పచ్చ నోటే కానీ అదంతా ఒకప్పుడన్న విషయం మర్చిపోకూడదు. ఏమైనా టన్ను పాత నోట్లు రూ.250అంటే డెడ్ చీప్ కదూ.