Begin typing your search above and press return to search.

జగన్ కు వచ్చిన ఐడియా కేసీఆర్ కు ఎందుకు రాలేదు?

By:  Tupaki Desk   |   18 April 2020 5:30 PM GMT
జగన్ కు వచ్చిన ఐడియా కేసీఆర్ కు ఎందుకు రాలేదు?
X
ఏళ్లకు ఏళ్లు కలిసి ఉండి.. విడిపోయాక పోలికలు సహజం. ఉమ్మడి ఏపీ కాస్తా రెండు తెలుగు రాష్ట్రాలుగా ముక్కలైన తర్వాత ఇరువురు సీఎంల పాలనను పోల్చటం తరచూ చోటు చేసుకుంటుంది. ఒక విధంగా ఇది మంచిదే. పోటీ తత్త్వం పెరిగి రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉన్నంత కాలం రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది.

తాజాగా చర్చకు వస్తున్న అంశాన్నేచూస్తే.. కరోనా కారణంగా యావత్ ప్రపంచమే ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాలకుల సామర్థ్యం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక పరిష్కారమన్నది తెలిసిందే. ఇక.. కీలకమైనది కరోనా పాజిటివ్ గా తేలిన వారికి వైద్యం అందించటంతో పాటు.. వారు పాజిటివ్ కు కారణమైన మూలాల్ని కనుగొని ఆ ఛైన్ ను తెంచేయటం అన్నింటికంటే కష్టమైన పని. ఈ విషయంలో ఏ చిన్నపాటి తప్పు జరిగినా.. భారీ మూల్యం తప్పదు.

ప్రాశ్చాత్య దేశాల్లో కరోనా విరుచుకుపడిన అన్ని దేశాల్లోనూ.. అక్కడి ప్రజలు అప్రమత్తంగా లేకపోవటం లేదంటే ప్రభుత్వాలు సమయానికి తగ్గట్లు స్పందించకపోవటమే కారణమన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాజిటివ్ గా తేలిన వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో క్వారంటైన్ చేయటంతోపాటు.. ర్యాండమ్ టెస్టులు వీలైనంత ఎక్కువగా చేయటం ద్వారా వ్యాప్తిని అడ్డుకునే వీలుంది. ఇందుకు.. కరోనా టెస్టు కిట్లు చాలా అవసరం. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక కిట్లతో పది నిమిషాల్లో పరీక్ష ఫలితం తేలే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తో దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష టెస్టింగ్ కిట్లు తెప్పించిన వైనం తెలిసిందే. లోకమంతా తనకు తెలుసని చెప్పే కేసీఆర్.. కొరియా కిట్లను తీసుకురావటంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? అన్నది ప్రశ్న. తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఫూల్ టెస్టులు పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు కొరియా కిట్లతో ఫలితం త్వరగా రావటమే కాదు.. పెద్ద సంఖ్యలో టెస్టులు చేయటానికి వీలుంటుంది. జగన్ కు చేతనైన విషయం కేసీఆర్ కు ఎందుకు చేతకావటం లేదు. సంక్షోభ సమయంలో సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా?