Begin typing your search above and press return to search.
వందో ప్రమాదాన్ని సెలట్రేట్ చేసుకున్నారు !
By: Tupaki Desk | 15 Sep 2017 6:06 AM GMTనిరసన తెలియజేయడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు! తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ విభిన్న పద్ధతుల్లో తమ ఆందోళనను తెలియజేస్తూనే ఉంటారు! కొందరు అర్ధనగ్నంగా.. మరికొందరు రోడ్లపై నాట్లు వేస్తూ.. మరి కొందరు నిరాహార దీక్షలు చేపట్టి.. ఇలా తమ నిరసన ప్రభుత్వానికో - యాజమాన్యానికో తెలియజేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి విభిన్న నిరసనే చేపట్టారు తమిళనాడు యువకులు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని తమ ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే! ఒకే రోడ్డుపై ఒకటి కాదు రెండు ఏకంగా 100 రోడ్డు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోకపోవడంతో.. సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసి తమ వ్యతిరేతకను తెలియజేశారు!
రోడ్డు ప్రమాదాలు నిత్యం వేలాది కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఎంతోమంది తమ జీవితాలు సర్వ నాశనం అవుతు న్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవన్నీ హామీలుగానే మిగిలుతున్నాయి. 100 ప్రమాదాలు ఒకేచోట జరిగితే అది ఎంత ప్రమాదకరమైన రహదారో అర్థం చేసుకోవచ్చు! తమిళనాడులోని కేకే నగర్ పాంబన్ రోడ్డు వంతెనపై 100వ ప్రమాదం జరిగింది. ఈ వంతెన రామనాథపురం జిల్లాలోని మండపం బీచ్ ప్రాంతంలో రామేశ్వరాన్ని కలుపుతుంది. పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవటంతో కొన్ని నెలల క్రితమే రూ. 2 కోట్లతో కొత్తది నిర్మించారు. అయితే, ఆ రోడ్డు నునుపుగా ఉంది. దీంతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
గురువారం మధురై నుంచి రామేశ్వరానికి వెళ్తున్న ప్రభుత్వ బస్సు పాంబన్ వంతెనపై వెళుతూ డివైడర్ ను - ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. దీంతో తమ నిరసనను వినూత్నంగా ప్రజలను తెలియజేయాలనుకున్నారు.
యువకులు ఇలా కేక్ కట్ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ విధంగా చేసినా ప్రభుత్వం ఈ ప్రమాదాల గురించి పట్టించుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు స్థానిక యువకులు చెప్పారు.