Begin typing your search above and press return to search.
కరోనా పై పోరాడి గెలిచిన 105 ఏళ్ల బామ్మ !
By: Tupaki Desk | 6 Aug 2020 11:10 AM GMTప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడగా.. మరికొంతమంది పోరాటం చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే ఓ 105 ఏళ్ల వయస్సులో కూడా ఓ బామ్మ మాత్రం దైర్యంగా కరోనాతో పోరాడి దైర్యంగా ఎదురుకొని ఇంటికి వెళ్ళింది. దైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించి చాలా మందికి ఆదర్శంగా నిలిచింది ఈ 105 ఏళ్ల బామ్మ.
పూర్తి వివరాలు చూస్తే .. కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానా వీధికి చెందిన ఈ 105 ఏళ్ల బామ్మ పేరు బి.మోహనమ్మ. ఈ బామ్మ భర్త మాధవస్వామి 1991లోనే మరణించారు. ఆమెకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఇక కర్నూల్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి 60 ఏళ్లు దాటిన వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బామ్మ మోహనమ్మకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ గా నిర్దారణ అయింది. వెంటనే ఆ బామ్మను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు.కరోనా నిర్ధారణ అయిన సమయంలోనూ ఆమెకు స్వల్ప జ్వరం మినహా ఇతరత్రా లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కొద్దిగా ఆయాసం రావడంతో ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోకుండానే కోలుకున్నారు.ఇక ఆమె గత నెల 31న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇంత వయస్సులోనూ మోహనమ్మ తన పనులు తానే చేసుకుంటున్నారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వాకింగ్ చేస్తారు. మితాహారం తీసుకుంటారు. ఇప్పటికీ కుమార్తెల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు. ఆమె జీవితంలో ఎనిమిది మంది సంతానంతో పాటు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలను కూడా చూశారు. కరోనాని జయించడం పట్ల ఆమె మాట్లాడుతూ.. రోగ్యకర అలవాట్ల వల్లే నేను కరోనాను జయించగలిగేలా చేశాయని, రోజు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేస్తుంటానని అవే నా ఆరోగ్య సూత్రాలు అని చెప్పుకొచ్చింది ఈ బామ్మ.