Begin typing your search above and press return to search.

360 డిగ్రీస్ లో వీడీపీ డిటైల్డ్ సర్వే..

By:  Tupaki Desk   |   9 April 2019 6:27 AM GMT
360 డిగ్రీస్ లో వీడీపీ డిటైల్డ్ సర్వే..
X
రెండే రెండు రోజులు. ఎంతగానో ఎదురుచూస్తున్న పోలింగ్ దగ్గరకు వచ్చేసింది. రెండు రోజుల తర్వాత ఇదే సమయానికి (ఉదయం 11 గంటల వేళకు) పోలింగ్ ట్రెండ్ మీద ఒక క్లారిటీ వచ్చేయటం ఖాయం. ఏపీ ప్రజలు ఎంతలా ఓట్లు వేస్తారన్న విషయంతో పాటు.. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లను చూసి.. సీన్ ఎవరికి సానుకూలంగా ఉంటుందన్న విషయంపై ఒక స్పష్టత రావటం ఖాయం.

ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్న విషయంపై బీజేపీకి చెందిన వీడీపీ అసోసియేట్స్ సంస్థ 360 డిగ్రీస్ లో డిటైల్డ్ సర్వే ఒకటి విడుదల చేసింది. లోతుగా చేసిన ఈ సర్వేలో ఏ కులం.. ఏ మతం వారు ఎవరికి ఓటు వేస్తారు లాంటి అంశాల్ని పేర్కొన్నారు.

ఆ సర్వేలో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

% వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో జగన్ పార్టీ 106 నుంచి 118 సీట్లు గెలుచుకునే వీలుందని పేర్కొంది

% అధికార తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని.. ఆ పార్టీ 54 నుంచి నుంచి 65 సీట్ల మధ్య నెగ్గే వీలుందని వెల్లడించింది.

% జనసేన మహా అయితే మూడు స్థానాల్లో గెలిచే వీలుందని పేర్కొంది

% మరే పార్టీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశం లేదని తేల్చింది.

% ఓట్ల శాతానికి వస్తే జగన్ పార్టీకి 44 శాతం.. టీడీపీ 40 శాతం.. జనసేన 10 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. బీజేపీకి 2.5శాతం.. కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు వచ్చే వీలున్నట్లు చెప్పింది.

% కులాల వారీగా చూస్తే కాపు.. బలిజలు మెజార్టీ టీడీపీకి మద్దతుగా నిలవనున్నారు. జగన్ పార్టీ.. జనసేన కంటే బాబుతోనేకాపులు ఉన్నట్లుగా తేల్చారు.

% రెడ్లలో 70శాతం జగన్ పార్టీకి.. 17 శాతం టీడీపీకి.. మూడు శాతంజనసేనకు పోల్ అవుతాయని. అదే సమయంలో కమ్మల ఓట్లలో 89 శాతం టీడీపీకిపడతాయని స్పష్టం చేసింది. జగన్ కు మూడు శాతం.. జనసేనకు రెండు శాతం కమ్మ ఓట్లు పడే వీలున్నట్లు చెప్పారు.

% ఎస్సీ.. ఎస్టీల్లో మెజార్టీ జగన్ పార్టీకే ఓట్లు పడనున్నట్లు సర్వే వెల్లడించింది. ముస్లింలు.. వైశ్యులు.. రాజుల్లో ఓట్లు ప్రధాన షేర్ జగన్ పార్టీకేనని.. బ్రాహ్మణులు మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపుతారని తేల్చింది. కొసమెరుపు ఏమంటే.. ఇదే సంస్థ.. గత డిసెంబరులో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ.. తాము ఇకపై ఎలాంటి సర్వేలు చేయమని చెప్పింది. అందుకు భిన్నంగా తాజా సర్వే ఫలితాన్ని విడుదల చేయటం గమనార్హం.