Begin typing your search above and press return to search.
108 పేజీల వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్
By: Tupaki Desk | 12 Jun 2017 11:52 AM GMTసాధారణంగా పెళ్లి పత్రికను రెండు పేజీలు - మహా అయితే నాలుగు పేజీల్లో ముగిస్తారు. కానీ, వరంగల్ కు చెందిన దంపతులు తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అతిథులందరూ కలకాలం గుర్తుంచుకోవాలనుకున్నారు. ''మనిసన్నాక కూసింత కళాపోసనుండాలి''.... అన్న రావుగోపాల రావు గారి మాటల నుంచి స్ఫూర్తి పొందినట్లున్నారు. అందుకే ఏకంగా 108 పేజీల పెళ్లి పత్రికను వినూత్న పద్ధతిలో ముద్రించారు.
ఈ నెల 14న హైదరాబాద్ లో వివాహం - 17న హన్మకొండలో జరిగే విందు.... ఈ రెండు ముక్కలు చెప్పడానికి 108 పేజీలు అవసరమా అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే! ఈ పత్రికలో రైల్వే - ఆర్టీసీ బస్సుల వివరాలు - బ్యాంకులు - అంబులెన్స్ - ప్రభుత్వాసుప్రతులు - హోటళ్లు - విద్యుత్తు కార్యాలయాలు - గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. అంతేకాదు, వరంగల్ లోని వివాహాది వేడుకలు నిర్వహించుకోదగ్గ మందిరాల వివరాలు - పోలీసు స్టేషన్ల ఫోన్ నంబర్లు - డాక్టర్లు - స్వచ్ఛంద సంస్థల వివరాలు - ఈ సంవత్సరం ద్వాదశ రాశి ఫలాలు వంటి వివరాలన్నీ ఇందులో ముద్రించారు.
వీటితో పాటు వివిధ సమయాల్లో ఆచరించాల్సిన పూజలు - విఘ్నేశ్వర - శ్రీవెంకటేశ్వర - శివ - విష్ణు - శ్రీలక్ష్మీనృసింహ - అయ్యప్ప - ఆంజనేయ - సుబ్రహ్మణ్య - సాయిబాబా - మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి తదితరాలను కూడా ముద్రించి గెస్ట్‌లకు వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించారు. తమ శుభలేఖను పదికాలాల పాటు దాచుకునేలా ముద్రించిన కల్వా వారి ఇన్విటేషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/