Begin typing your search above and press return to search.

రెండు ప్రపంచ యుద్ధాలను జయించి..చివరికి కరోనా చేతిలో..!

By:  Tupaki Desk   |   30 March 2020 12:30 PM GMT
రెండు ప్రపంచ యుద్ధాలను జయించి..చివరికి కరోనా చేతిలో..!
X
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. అలాగే కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు ప్రపంచ యుద్ధాలలో పోరాడి గెలిచిన పోరాట యోధురాలు కరోనా దెబ్బకి కుప్పకూలిపోయింది. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని వణికించిన ‘స్పానిష్‌ ఫ్లూ’ని తట్టుకుని నిలబడింది. కానీ ఇప్పుడు.. ప్రపంచానికే సవాల్‌ విసురుతున్న కరోనాతో పోరాడి.. ఓడి - తనువు చాలించింది. బ్రిటన్‌ లో కరోనా వైరస్ కు బలైన అత్యంత వృద్ధురాలిగా నిలిచింది. 108 ఏళ్ల ఆ యోధురాలి పేరు హిల్డా చర్చిల్‌.

హిల్డా చర్చిల్‌.. మరో వారం రోజుల్లో తన 109వ పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధమవుతుండగా కరోనా బారినపడి ఆదివారం కన్నుమూసింది. 1918లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్‌ ఫ్లూ ని ఆమె తట్టుకుని నిలబడ్డారు. అయితే కరోనా నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు. మరో వారంలో తన 109వ పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ.. కరోనా బారినపడి ఆదివారం కన్నుమూసింది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 723,304 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..అందులో 33 వేల మంది మృతిచెందారు. ఇక మనదేశంలో ఇప్పటి వరకు 1,071 మందికి కరోనా సోకగా ..అందులో 29 మంది మృతి చెందారు. కరోనా ని అరికట్టడానికి కేంద్ర - రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.