Begin typing your search above and press return to search.
వెంకన్న స్పీడు..గంటలో 10800 టిక్కెట్ల సేల్
By: Tupaki Desk | 16 Dec 2015 7:41 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ నెల 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 10,800 టికెట్లను టీటీడీ తమ వెబ్ సైట్ లో ఉంచింది. ఏకాదశి నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం టికెట్ల వినియోగానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేసింది. అయితే కేవలం గంట వ్యవధిలోనే శ్రీవారి భక్తులు టికెట్లను కొనుగోలు చేయడం విశేషం.
కాగా గత కొద్దికాలంగా తిరుమల - తిరుపతిలో వర్షాలు - చెన్నైలో వరదల కారణంగా తిరుపతికి రద్దీ బాగా తగ్గింది. ఒక్కోరోజు సాధారణ దర్శనం కూడా కేవలం గంటలోనే పూర్తయ్యే పరిస్థితి. వర్షాలు - వరదలు తగ్గినా కూడా ఇప్పటికీ భక్తుల తాకిడి పుంజుకోలేదు. ఈలోగా వైకుంఠ ఏకాదశి రానుండడంతో భక్తుల రాక మళ్లీ పెరుగుతుందని టీటీడీ కూడా చెప్తోంది. తాజాగా ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్ముడుపోయిన స్పీడు ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.
గంటలో 10800 టిక్కెట్లు అమ్ముడు పోవడం సాధారణ విషయం కాదు.. అంటే సుమారుగా నిమిషానికి 180, సెకనుకు 3 టిక్కెట్లు అమ్ముడైనట్లు లెక్క.