Begin typing your search above and press return to search.
అటెండర్లతో పరీక్ష పేపర్లు దిద్దించారు
By: Tupaki Desk | 3 Nov 2015 10:30 PM GMTవిద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే పరీక్షా పత్రాల దిద్దే పనిని ప్యూన్లు - పారిశుద్ధ్య పనివారు - వాచ్ మేన్లకు అప్పగించారు. అయితే... ఇది మన రాష్ట్రంలో మాత్రం కాదు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలా అటెండర్లు - బంట్రోతులతో పరీక్ష పేపర్లు దిద్దించారు.
ఉత్తరప్రదేశ్ లో పదో తరగతి - ఇంటర్ పరీక్షల పత్రాలు దిద్గడంలో కొత్త కోణం వెలుగుచూసింది.
పరీక్ష పేపర్ల వేల్యుయేషన్ చేసేందుకు ప్యూన్లు - వాచ్ మెన్లు - పారిశుద్ధ్య కార్మికులను ఫ్యాకల్టీ నిపుణులుగా చూపిస్తూ పాఠశాలల నుంచి బోర్డుకు వివరాలు అందించారట. దీంతో వారినే ఫ్యాకల్టీలుగా భావించి ఇంటర్ - టెన్త్ పేపర్లు దిద్దించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమేనన్న విమర్శలు వస్తున్నాయి.
నిబంధనల మేరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ - ఎయిడెడ్ - సెల్ఫ్ ఫైనాన్స్ డ్ పాఠశాలు బోర్డు పరీక్షల వాల్యుయేషన్ కోసం సబ్జక్ట్ నిపుణుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. 2013లో అమలులోనికి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం వేల్యుయేషన్ చేసే టీచర్ వివరాలు - అనుభవం - విద్యార్హతలు - ఉద్యోగంలో చేరిన తేదీ తదితర వివరాలను యూపీ బోర్డ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలి. అయితే క్లాస్ 12 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం ఇన్విజిలేటర్ల ఎంపిక కోసం ఈ డేటాబేస్ ను అధికారులు పరిశీలించినప్పుడు దిమ్మతిరిగే అవకతవకలు వెలుగులోనికి వచ్చాయి. పలు స్కూళ్లు పేపర్ వాల్యుయేషన్ కోసం ఇచ్చిన టీచర్లు, సబ్జెక్ట్ నిపుణులల జాబితాలో వాచ్ మెన్లు - ప్యూన్లు - శానిటేషన్ వర్కర్ల పేర్లు ఉన్నాయట. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు.