Begin typing your search above and press return to search.
అంటార్కిటికాపై ఆధిపత్యం కోసం 11 మందిని కన్నారు?
By: Tupaki Desk | 22 Nov 2022 2:30 AM GMTఅంటార్కిటికా ఖండం.. భూమిపై అత్యంత నివాసయోగ్యం కాని ప్రదేశం. అయితే ఇక్కడి మంచుతో కప్పబడిన అత్యంత కఠిన ప్రదేశంలో కూడా 11 మంది పిల్లలు పుట్టారంటే అతిశయోక్తి కాదు.. ఈ పుట్టుకకు ఒక కారణం ఉంది. ఆ మంచు ఖండంపై దేశాల ఆధిపత్యం కోసం ఈ పనిచేశారు. ఆ దేశాల నాయకులు ఎందుకు ఈ పనిచేశారు? దాని అర్థం ఏమిటి అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..
చిలీ, అర్జెంటీనా అనే రెండు దేశాలు అర్జెంటీనా భూమిపై హక్కులు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఎవరైనా పుడితే ఆ ప్రదేశం వారి హక్కుగా మారుతుందని ఆలోచన చేసిన అర్జెంటీనా దేశం ఏడు నెలల గర్భవతి అయిన స్త్రీని ఖండానికి పంపింది. జనవరి 7, 1978న ఈ మహిళ ఒక సైనిక అధికారిని వివాహం చేసుకుంది. అనంతరం వీరిద్దరినీ అంటార్కిటికాకు పంపి సకల సౌకర్యాలు కల్పించింది. ఈ క్రమంలోనే వీరికి ఎమిలియో మార్కోస్ పాల్మాకు అనే పాప అంటర్కాటికాలోనే పుట్టింది. ఈ మంచు ఖండంలో పుట్టిన తొలి బాబు ఇతడే. అంటార్కిటికాలో సహజంగా జన్మించిన మొదటి పౌరుడిని కలిగి ఉన్న ఫలితంగా అర్జెంటీనా తమకు అంటార్కిటికా భూమిపై హక్కులు ఉన్నాయని భావించింది.
అంతటితో ఈ వివాదం ఆగలేదు. ఆ తర్వాత అంటార్కిటికాకు పక్కనే ఉండే చిలీ దేశం కూడా ఒక యువ జంటను గర్భం దాల్చడానికి , నవజాత శిశువుకు జన్మనివ్వడానికి ఈ ద్వీపానికి పంపింది. నవంబర్ 21, 1984న, జువాన్ పాబ్లో కమాచో మార్టినో జన్మించాడు. చిలీ కూడా ఇప్పుడు అంటార్కిటికా భూమిపై తమకు వాటా ఉందని ఇది తమ ప్రాంతం అని భావించింది.
రెండు దేశాలు అంటార్కిటికాలో పుట్టిన బిడ్డలను కలిగి ఉన్నాయి. అలా అంటార్కిటికా మొత్తం 11. మంది జన్మించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మొత్తం 11 మంది పుట్టిన అంటార్కిటికాకు ప్రపంచంలోనే అతి తక్కువ శిశు మరణాల రేటును అందించారు.
అంటార్కిటికాపై ఏ దేశం కలిగి ఉందని చిలీ లేదా అర్జెంటీనా హక్కుల కోసం ఆరోజు నుంచి పోరాడుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచదేశాలు మాత్రం ఈ రెండూ దేశాలే కాదు.. డిసెంబర్ 1, 1959న అంటార్కిటిక్ ఒప్పందంపై సంతకం చేసిన అంతర్జాతీయ దేశాల సమూహం కూడా ఇది ఎవరి ఖండం కాదని.. అందరిదీ అని తేల్చిచెప్పాయి. అన్ని దేశాలు ఎవరికి వారు అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటికీ శాంతి -విజ్ఞాన శాస్త్రానికి కేటాయించిన భూమిగా పరిశోధనలకు అంటార్కిటికా పేరుగాంచింది..
వివిధ దేశాలు ఎంతగా ప్రయత్నించినా అక్కడ కలకాలం నివసించే భూమి మాత్రం కాదు. ఇతరులు ఎంత చెల్లించడానికి రెడీ అయినా ఇష్టపడని భూమి అది. అంటార్కిటికాలో జన్మించిన 11 మంది శిశువులు కూడా ఇప్పుడు అక్కడ లేరు. సో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం కంటే అవగాహనతో పరిశోధనలకు ఉపయోగిస్తే బెటర్ అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.